మిస్ వరల్డ్ ‌2021 రేసులో ఇండో అమెరికన్ అమ్మాయి... ముద్దుగుమ్మలతో శ్రీషైనీ సందడి, ఫోటోలు వైరల్

భారత సంతతి యువతి, మిస్ వరల్డ్ అమెరికా 2021 విజేత శ్రీ షైనీ మరో ప్రతిష్టాత్మక టైటిల్‌పై కన్నేశారు.ప్యూర్టో రికోలో జరుగుతున్న మిస్ వరల్డ్ 2021 రేసులో ఆమె నిలిచారు.70వ మిస్ వరల్డ్ ఎడిషన్‌లో అమెరికా తరపున ఆమె ప్రాతినిథ్యం వహిస్తున్నారు.దీనిలో భాగంగా ప్యూర్టో రికోకు శ్రీషైనీ ఈ శనివారం చేరుకున్నారు.

 Shree Saini Joins Miss World 2021 Contestants At Puerto Rico, Shree Saini , Miss-TeluguStop.com

డిసెంబర్ 16న జరగనున్న ఈ మెగా ఈవెంట్ ఫైనల్‌లో జమైకాకు చెందిన టోనీ ఆన్ సింగ్ తన వారసురాలికి పట్టాభిషేకం చేయనున్నారు.దాదాపు ఐదేళ్ల విరామం తర్వాత స్విమ్ సూట్ పోటీ (మిస్ వరల్డ్ బీచ్ బ్యూటీ)ని తిరిగి ప్రవేశపెట్టనున్నారు.

ఈ ఎడిషన్ వాస్తవానికి 2020 చివరిలో షెడ్యూల్ చేశారు.అయితే కోవిడ్ 19 మహమ్మారి కారణంగా నిర్వాహకులు పోటీలను వాయిదా వేశారు.మిస్ వరల్డ్ 2021 పోటీలకు గాను వివిధ దేశాల నుంచి 104 ఎంట్రీలు వచ్చాయి.

ప్యూర్టో రికోకు చేరుకున్న తర్వాత శ్రీ షైనీ తన సోషల్ మీడియాలో ఇలా రాసుకొచ్చారు.

‘‘భగవంతుడు తనను మిస్ వరల్డ్ స్టేజ్‌పైకి నడిపించాడు.ఈ ప్రయాణంలో మీ అందరీ ప్రార్ధనలను నేను ఆశిస్తున్నాను.

ప్రపంచంలోనే గొప్పదైన సేవ చేసే ఉద్యోగం కోసం దరఖాస్తు చేసుకున్నందుకు నాకు గర్వంగా వుంది.మిలియన్ల మంది అమెరికన్లకు , భారతీయ వారసత్వానికి ప్రాతినిథ్యం వహించడం నాకు దక్కిన గౌరవం.

నన్ను భగవంతుడు భారతీయ అమెరికన్‌గా మార్చడానికి కారణం వుండి వుంటుందన్నారు.

Telugu Shree Saini, Puerto Rico, Shreesaini-Telugu NRI

పంజాబ్ రాష్ట్రం లూధియానాలో 1996 జనవరి 6న జన్మించారు శ్రీషైనీ.ఆమెకు ఐదేళ్లు వున్నప్పుడే షైనీ కుటుంబం అమెరికాకు వలస వెళ్లింది.బాల్యంలో వున్నప్పుడే పేదరికాన్ని చాలా దగ్గరి నుంచి చూసిన ఆమె.పిల్లలకు అందమైన బాల్యాన్ని అందించాలనే సామాజిక బాధ్యతను స్వీకరించాలని అప్పుడే నిర్ణయించుకున్నారు.12 ఏళ్ల వయసున్నప్పుడు షైనీ హృద్రోగం బారినపడ్డారు.ఆమె హృదయ స్పందన నిమిషానికి కేవలం 20 బీట్స్‌గానే వుండేది.దీంతో ఆమె మళ్లీ డ్యాన్స్ చేయడం కుదరదని వైద్యులు వారి కుటుంబానికి తెలిపారు.

Telugu Shree Saini, Puerto Rico, Shreesaini-Telugu NRI

కానీ మొక్కవోనీ దీక్షతో శ్రీషైనీ గంటల తరబడి ప్రాక్టీస్ చేసి డ్యాన్స్‌లో పట్టు సంపాదించింది.షైనీ హార్వర్డ్ యూనివర్సిటీ, యేల్ స్కూల్ ఆఫ్ డ్రామా, స్టాన్‌ఫోర్డ్ విశ్వవిద్యాలయం, వాషింగ్టన్ విశ్వవిద్యాలయంలో విద్యాభ్యాసం చేసింది.వాషింగ్టన్ రాష్ట్రానికి చెందిన శ్రీషైనీ.మిస్ వరల్డ్ అమెరికా కిరీటం పొందిన తొలి ఇండో అమెరికన్‌గా రికార్డుల్లోకెక్కిన సంగతి తెలిసిందే.ఈ ఏడాది అక్టోబర్‌లో లాస్ ఏంజిల్స్‌లోని మిస్ వరల్డ్ అమెరికా ప్రధాన కార్యాలయంలో జరిగిన ఫైనల్ పోటీలలో డయానా హేడెన్ శ్రీ షైనీకి కిరీటం ధరింపజేశారు

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube