చీకోటి ప్రవీణ్ ను. చేర్చుకోవాలా వద్దా ? డైలమాలో బీజేపీ ?

క్యాసినో కింగ్ గా పేరుపొందిన చీకోటి ప్రవీణ్( Chikoti Praveen ) ఇటీవల కాలంలో వార్తల్లో వ్యక్తిగా ఉంటున్నారు.ఆయన ప్రధాని నిందితుడిగా ఉండడం,  విదేశాల్లోనూ ఆయన వ్యవహారాలు బయటపడడం వంటివన్నీ సంచలనం సృష్టించాయి.

 Should Cheekoti Praveen Be Included Or Not? Bjp In Dilemma? Cheekoti Praveen, Bj-TeluguStop.com

ఇక చాలాకాలంగా ఆయన రాజకీయాల్లో చేరేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.అయితే ఆయనపై ఉన్న కేసులు తదితర కారణాలతో ఎప్పటికప్పుడు ఆ ప్రయత్నాలు ఫలించడం లేదు.

ఆయన బిజెపిలో చేరేందుకు ఆసక్తితో ఉన్నారు.అదే ఉద్దేశంతో బిజెపి అగ్ర నేతలు అందరిని తాజాగా కలిశారు.

  గతంలోనే ఆయన తాను రాజకీయాల్లోకి ప్రవేశిస్తానంటూ స్వయంగా ప్రకటించారు.

Telugu Bandi Sanjay, Brs, Dk Aruna, Kyasino, Telangana-Latest News - Telugu

 నిన్ననే ఢిల్లీకి వెళ్లి బిజెపి కీలక నేతలు అందరినీ కలిసి తన మనసులో మాటను బయటపెట్టారు.బిజెపి తెలంగాణ మాజీ అధ్యక్షుడు బండి సంజయ్( Bandi Sanjay ) ,   బిజెపి ఉపాధ్యక్షురాలు, డీకే అరుణతోను ప్రవీణ్ భేటీ అయ్యారు.ఈ సందర్భంగా తాను బిజెపిలో చేరాలనుకుంటున్నాననే విషయాన్ని బయటపెట్టారు.

అయితే ప్రవీణ్ ను చేర్చుకునే విషయంలో బండి సంజయ్ నుంచి ఎటువంటి హామీ లభించలేదని, బిజెపి అధిష్టానం పెద్దలతో మాట్లాడి చెబుతానని సంజయ్ చెప్పినట్లుగా ప్రచారం జరిగినా,  సంజయ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారనే మరో ప్రచారం తెరపైకి వచ్చింది.అయితే ప్రవీణ్ ను బిజెపిలో చేర్చుకునే విషయంలో ఆ పార్టీ హై కమాండ్ కూడా ఆలోచనలో ఉందంట.

Telugu Bandi Sanjay, Brs, Dk Aruna, Kyasino, Telangana-Latest News - Telugu

దీనికి కారణం ఆయన క్యాసినో కేసుల్లో ఇరుక్కోవడం,  ఇప్పటికే ఆయనపై అనేక కేసులు నమోదవడం ,  విదేశాల్లోనూ ఆయనపై ఫిర్యాదులు ఉండడం వంటి విషయాలపై తర్జనభజన పడుతోంది.ఆయనను బిజెపిలో చేర్చుకుంటే బీఆర్ఎస్ తమను టార్గెట్ చేసుకుంటుందనే ఆలోచనలో తెలంగాణ బిజెపి( Telangana bjp )నాయకులు ఉన్నారట.బిజెపిలో చేరే ఉద్దేశంతోనే కొద్దిరోజుల క్రితం ప్రవీణ్ కీలక వ్యాఖ్యలు చేశారు.తాను హిందువుగానే పుట్టానని , హిందుత్వం అనేది తన రక్తంలోనే ఉందని , ఒకవేళ రాజకీయంగా వెళితే నేను బిజెపిలోని చేరుతానని కామెంట్స్ చేశారు.

హిందువుగానే పుట్టానని,  హిందూ గానే చస్తాను అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి అయితే చీకోటి ప్రవీణ్ బిజెపిలో చేరడం వెనక అసలు కారణాలు వేరే ఉన్నాయని,  కేసుల నుంచి తప్పించుకునేందుకు ఆయన బిజెపిలో చేరుతున్నారనే విమర్శలు వ్యక్తం అవుతున్నాయి .అయితే ప్రవీణ్ ను చేర్చుకునే విషయంలో ఇంకా బీజేపీ అయితే ఏ నిర్ణయం తీసుకోలేదట.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube