స్టార్ హీరో బాలకృష్ణ హీరోగా తెరకెక్కిన వీరసింహారెడ్డి మూవీ దాదాపుగా అన్ని ఏరియాల్లో బ్రేక్ ఈవెన్ అయింది.ఫస్ట్ వీకెండ్ తో పాటు సెకండ్ వీకెండ్ ను కూడా క్యాష్ చేసుకున్న ఈ సినిమా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.
అయితే ఈ సినిమా పుట్టుకకు ఒక డైలాగ్ కారణమని తెలిసి నెటిజన్లు సైతం ఒకింత ఆశ్చర్యానికి గురవుతున్నారు.చాలా సంవత్సరాల క్రితం బాలయ్య వినాయక్ కాంబినేషన్ లో చెన్నకేశవరెడ్డి సినిమా తెరకెక్కిన సంగతి తెలిసిందే.
ఈ సినిమాలో “సీమ రక్తం కుతకుతలాడుతోంది” అనే డైలాగ్ ఉంటుంది.ఈ డైలాగ్ ఆ సినిమా సక్సెస్ లో కీలక పాత్ర పోషించింది.
బాలయ్య మాట్లాడుతూ వీరసింహారెడ్డి సినిమాకు చెన్నకేశవరెడ్డి సినిమాలోని డైలాగ్ కు సంబంధం ఉందని చెప్పుకొచ్చారు.కొన్నిసార్లు మేనరిజం నుంచి డైలాగ్స్ నుంచి సినిమా కథలు పుట్టుకొస్తాయని బాలయ్య కామెంట్ చేశారు.
గోపీచంద్ మలినేని నా దగ్గరికి వచ్చిన సమయంలో నేను చెన్నకేశవరెడ్డి డైలాగ్ చెప్పగా ఆ డైలాగ్ నుంచి ఈ సినిమా కథ పుట్టిందని బాలయ్య కామెంట్ చేశారు.

“సీమ రక్తం కుతకుతలాడుతోంది” డైలాగ్ విన్న తర్వాత గోపీచంద్ మలినేని రాయలసీమ బ్యాక్ డ్రాప్ లో కథను సిద్ధం చేసుకొని వచ్చారని బాలయ్య చెప్పుకొచ్చారు.ఇతర భాషల ప్రేక్షకులు సైతం ఈ సినిమాను ఆదరించారని బాలయ్య కామెంట్లు చేశారు.నా బాడీ లాంగ్వేజ్ కు అనుగుణంగా థమన్ పాటలు అందించాడని బాలకృష్ణ అభిప్రాయం వ్యక్తం చేయడం గమనార్హం.