Sreeleela :శ్రీలీల జాతకం ఇలా ఉందేంటి.. అచ్చం తల్లి పరిస్థితియే తెచ్చుకోనుందా?

అప్పుడప్పుడు హీరో హీరోయిన్ల జాతకాలు బాగా హాట్ టాపిక్ గా మారుతూ ఉంటాయి.ఎందుకంటే సెలబ్రెటీల వ్యక్తిగత విషయాలలో బాగా ఆసక్తి చూపిస్తుంటారు జనాలు.

 Shocking Facts About Actress Sreeleela Jathakam-TeluguStop.com

వాళ్ళ లైఫ్ లో ఏం జరుగుతుంది.ఏం జరగబోతుంది.

అనేది వాళ్లకు చాలా ఇంట్రెస్ట్.అయితే తాజాగా శ్రీలీల( Actress Sreeleela ) జాతకం గురించి ఒక ఇంట్రెస్టింగ్ విషయం బయటపడటంతో తనకు జరగబోయేది తెలిసింది తన ఫ్యాన్స్ చాలా ఫీల్ అవుతున్నారు.

ఇంతకూ ఆమె జాతకంలో ఏం జరగబోతుందో ఇప్పుడు తెలుసుకుందాం.

Telugu Sreeleela-Movie

ఈ ముద్దుగుమ్మ సినీ ఇండస్ట్రీకి చిన్నవయసులోనే హీరోయిన్ గా పరిచయమై కుర్రాళ్లకు క్రష్ గా మారింది.ఈమె తొలిసారిగా ముద్దు అనే కన్నడ సినిమాతో 2019లో అడుగు పెట్టగా.ఈ సినిమా మంచి సక్సెస్ అయ్యింది.

ఇక 2021 లో పెళ్లి సందD సినిమా( Pelli SandaD )లో నటించి తన తొలి చూపులతోనే తెలుగు ప్రేక్షకుల మనసులు దోచుకుంది.ఈ ఒక్క సినిమాతో టాలీవుడ్ లో ఓవర్ నైట్ స్టార్ గా మారింది.

గత ఏడాది మాస్ మహారాజ్ రవితేజ నటించిన ధమాకా సినిమా( Dhamaka )లో హీరోయిన్ గా నటించగా ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది.అంతేకాకుండా భారీ అవకాశాలు కూడా అందుకుంది.

ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ ఖాతాలో వరుసగా 12 సినిమాలు ఉన్నాయి.అందులో పవన్ కళ్యాణ్, బాలయ్య, మహేష్ బాబు, నితిన్, రామ్, విజయ్ దేవరకొండ, వైష్ణవ్ తేజ్ ఇలా మరికొంతమంది హీరోల సినిమాలలో బిజీగా ఉంది.

Telugu Sreeleela-Movie

ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో కూడా బాగా సమయాన్ని గడుపుతూ ఉంటుంది.నిత్యం తనకు సంబంధించిన ఫోటోలను, సినిమా అప్డేట్లను పంచుకుంటూ ఉంటుంది.ఇక చూడటానికి చాలా అందంగా ఉండే ఈ ముద్దుగుమ్మకు కుర్రాళ్ళు ఫిదా అవుతూ ఉంటారు.ఈమె ఏదైనా ఫోటో పెడితే చాలు అది క్షణాల్లో వైరల్ అవుతుంది.

ఇదంతా పక్కన పెడితే ఈ బ్యూటీ గురించి ఒక వార్త బాగా వైరల్ అవుతుంది.

అదేంటంటే తన జాతకంలో ఒక దోషముందని తెలుస్తుంది.

ఇంతకు అదేంటంటే.తన జాతకంలో తన అమ్మలాగే సింగిల్ గా జీవితాన్ని కొనసాగిస్తుందని తెలిసింది.

శ్రీ లీల తల్లి తన భర్తకు విడాకులు ఇచ్చి కూతురితో ఒంటరిగా గడుపుతున్న సంగతి తెలిసిందే.తన తల్లి లాగానే శ్రీలీలకు కూడా పెళ్లి జీవితం( Sreeleela Marriage Life ) ఎక్కువ రోజులు కొనసాగదని.

పెళ్లయి ఒక బిడ్డ పుట్టాక విడాకులు తీసుకుంటుందని తెలిసింది.

Telugu Sreeleela-Movie

ఇక కూతురు జాతకం( Sreeleela Astrology )లో అలా ఉండటంతో తల్లి తన శ్రీలీలకు పెళ్లి చేయకూడదని నిర్ణయించుకుందట.అంతేకాకుండా సింగిల్ లైఫ్ ఎంజాయ్ చేయమని.తన కాలు మీద తను బతకాలి అని తెలిపిందట.

ఇక ప్రస్తుతం ఈ విషయం వైరల్ అవ్వడంతో తన అభిమానులు అస్సలు తట్టుకోలేకపోతున్నారు.ఇక మరి కొంతమంది ఇవన్నీ ఫేక్ వార్తలు అని కొట్టి పారేస్తున్నారు.

ఇక ఇందులో ఎంత నిజం ఉందో ఎంత అబద్ధం ఉందో తెలియాలి అంటే కొంతకాలం వరకు వేచి చూడాల్సిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube