జిల్లా వ్యాప్తంగా ప్రశాంతంగా ముగిసిన గ్రూప్-4 పరీక్ష

రాజన్న సిరిసిల్ల జిల్లా( Rajanna Sircilla ) వ్యాప్తంగా గ్రూప్-4 పరీక్ష ప్రశాంతంగా ముగిసింది.గ్రూప్ -4 పరీక్ష జిల్లాలో పరీక్ష రాసేందుకు అత్యధికంగా 14,011 మంది దరఖాస్తు చేసుకోగా ఉదయం పూట నిర్వహించిన పేపర్ కు 11,846 మంది, మధ్యాహ్నం నిర్వహించిన పేపర్ కు 11,803 మంది అభ్యర్థులు హాజరై పరీక్ష రాశారు.ఈ పరీక్ష కు హాజరయ్యే అభ్యర్థుల కోసం రాజన్న సిరిసిల్ల జిల్లాలోని సిరిసిల్ల, వేములవాడ, ఎల్లారెడ్డిపేట, తంగల్ల పల్లి, బోయినిపల్లి లలో 50 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు.51 మంది చీఫ్ సూపరింటెండెంట్ లను, 50 మంది లైజన్ అఫీసర్లను, 614 మంది ఇన్విజిలేటర్లను, 13 రూట్ ల కోసం 26 మంది రూట్ అధికారులను నియమించారు.

పర్యవేక్షించిన జిల్లా కలెక్టర్

గ్రూప్ -4 పరీక్ష( Group 4 Exam ) జరుగుతున్న తీరును జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి( District Collector Anurag Jayanti ) ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ పరీక్షలు పారదర్శకంగా , ప్రశాంత వాతావరణంలో సజావుగా జరిగేందుకు అధికారులకు దిశా నిర్దేశం చేశారు.

 Group 4 Exam Completed Peacefully In Rajanna Sircilla,group 4 Exam,rajanna Sirci-TeluguStop.com

పరీక్ష కేంద్రాలను తనిఖీ చేసిన జిల్లా అదనపు కలెక్టర్

జిల్లా కలెక్టర్ ఎన్ ఖీమ్యా నాయక్( Kheemya Naik ) సిరిసిల్ల పట్టణంలోని చిన్న బోనాల సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల, ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని గాయత్రి డిగ్రీ పీజీ కళాశాలలో, విజ్ఞాన్ ఇంగ్లీష్ మీడియం హైస్కూల్లో ఏర్పాటు చేసిన పరీక్ష కేంద్రాన్ని తనిఖీ చేశారు.పరీక్షలు సజావుగా జరిగేందుకు అధికారులకు దిశా నిర్దేశం చేశారు.రాజన్న సిరిసిల్ల జిల్లాలో గ్రూప్ -4 పరీక్షల నిర్వహణ కు అధికారులు పకడ్బందీ చర్యలు తీసుకోవడంతో పరీక్షలు ప్రశాంత వాతావరణంలో, పారదర్శకంగా జరిగాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube