Shiva Rajkumar : రజినీకాంత్ చేసిన సహాయం ఎప్పటికీ మర్చిపోలేము.. శివరాజ్ కుమార్ కామెంట్స్ వైరల్?

కన్నడ సూపర్‌ స్టార్స్‌ పునీత్‌ రాజ్‌కుమార్‌, అన్న శివ రాజ్‌ కుమార్‌( shiva rajkumar ) ల నుంచి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.పునీత్ రాజ్ కుమార్ ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయిన విషయం తెలిసిందే.

 Shiva Rajkumar Gets Emotional About Superstar Rajinikanth-TeluguStop.com

అన్న శివరాజ్ కుమార్ ప్రస్తుతం సినిమాలలో రాణిస్తూ బిజీ బిజీగా ఉన్నారు.కాగా వీరి తండ్రి, దివంగత నటుడు డాక్టర్‌ రాజ్‌కుమార్‌ కూడా పెద్ద నటుడు.

కన్నడ ఇండస్ట్రీలో స్టార్‌గా వెలుగొందిన ఈయనను అప్పట్లో గంధపు చెక్కల దొంగ వీరప్పన్‌ కిడ్నాప్‌ చేశాడు.ఇప్పటికీ కన్నడ ప్రజలు ఆ సంఘటనను అంత ఈజీగా మర్చిపోలేరు.తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న శివరాజ్ కుమార్ ఇంటర్వ్యూలో భాగంగా మాట్లాడుతూ ఈ విషయం గురించి స్పందించారు.2000 జూలై 30న రాత్రి 9.30 గంటలకు వీరప్పన్‌( Veerappan ) గాజనూరు ఫాంహౌస్‌ నుంచి రాజ్‌కుమార్‌ ను కిడ్నాప్‌ చేశాడు.

Telugu Jailer, Kollywood, Punith, Rajinikanth, Rajkumar, Shiva Rajkumar, Veerapp

రాజ్‌కుమార్‌తో పాటు ఆయన అల్లుడు గోవింద్‌రాజ్‌, బంధువు నగేష్‌, అసిస్టెంట్‌ దర్శకుడు నాగప్పను కూడా కిడ్నాప్‌ చేశాడు.అక్కడి నుంచి వారిని సత్యమంగళ అడవిలోకి తీసుకెళ్లాడు.అప్పట్లో ఈ సంఘటన దేశవ్యాప్తంగా పెను సంచలనం సృష్టించింది.

రాజ్‌కుమార్‌కు భద్రత కల్పించడంలో తమిళనాడు ప్రభుత్వం దారుణంగా విఫలమైందని, ఇది క్షమించరాని నేరమని సుప్రీం కోర్టు సైతం ఆగ్రహం వ్యక్తం చేసింది.వీరప్పన్‌ రాజ్‌కుమార్‌ను టార్గెట్‌ చేశాడని 1999లోనే ప్రత్యేక దర్యాప్తు బృందం ప్రభుత్వాన్ని హెచ్చరించింది.

అయినా ప్రభుత్వం రాజ్‌కుమార్‌కు భద్రత కల్పించడంలో అలసత్వం వహించింది.

Telugu Jailer, Kollywood, Punith, Rajinikanth, Rajkumar, Shiva Rajkumar, Veerapp

రాజ్‌ కుమార్‌ కిడ్నాప్‌ అయిన సమయంలో ఆయన కోసం లక్షలాది మంది అభిమానులు పెద్ద ఎత్తున ధర్నాలు చేశారు.ప్రభుత్వంపై ఒత్తిడి పెరగడంతో చివరకు వీరప్పన్‌తో చర్చలు జరిపింది.అటు వీరప్పన్ ఏకంగా రూ.900 కోట్లు విలువచేసే బంగారం, రూ.100 కోట్ల నగదు ఇవ్వాలని డిమాండ్‌ చేశాడు.లైఫ్‌ అండ్‌ ఫాల్‌ ఆఫ్‌ వీరప్పన్‌ పుస్తకంలో పేర్కొన్నదాని ప్రకారం అప్పటి ముఖ్యమంత్రి ఎస్‌ఎం.కృష్ణ ప్రభుత్వం మూడు విడతలుగా మొత్తం రూ.15.22 కోట్లను వీరప్పన్‌కు అందజేసినట్లు తెలుస్తోంది.108 రోజుల తర్వాత నవంబర్‌ 15న రాజ్‌కుమార్‌ను విడుదల చేశాడు.2004 అక్టోబర్‌ 18న వీరప్పన్‌ ఎన్‌కౌంటర్‌లో చనిపోయాడు.అలా తన తండ్రిని కిడ్నాప్ చేసిన సమయంలో రజనీకాంత్‌( Rajinikanth ) తమ కుటుంబానికి ఎంతో అండగా ఉన్నారు ఆయన రుణం ఎప్పటికీ తీర్చుకోలేము ఆయన చేసిన సహాయం ఎప్పటికీ మర్చిపోను అని చెప్పుకొచ్చారు శివరాజ్ కుమార్.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube