దర్శక ధీరుడు రాజమౌళి విడుదల చేసిన శివ నాగేశ్వరరావు 'దోచేవారెవరురా' టీజర్‌

IQ క్రియేషన్స్ బ్యానర్ పై బొడ్డు కోటేశ్వరరావు నిర్మాతగా సీనియర్ దర్శకుడు శివ నాగేశ్వరావు తెరకెక్కిస్తున్న సినిమా ‘దోచేవారెవరురా‘.ఇప్పటికే దర్శకుడు రాంగోపాల్ వర్మ చేతల మీదుగా విడుదలైన ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.

 Shiv Nageswara Rao's 'dochevarevarura' Teaser Released By Director Rajamouli Sh-TeluguStop.com

దాంతోపాటు లిరికల్ సాంగ్ కు కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది.తాజాగా ఈ సినిమా నుంచి మరో అప్డేట్ ఇచ్చారు దర్శక నిర్మాతలు.

దర్శక ధీరుడు రాజమౌళి చేతుల మీదుగా “దోచేవారెవరురా” సినిమా టీజర్ విడుదల చేశారు.

దర్శక ధీరుడు రాజమౌళి మాట్లాడుతూ.

‘నేను శివ నాగేశ్వరరావు గారి సినిమాల్లోని కామెడీ, ఎంటర్‌టైన్మెంట్ బాగా ఎంజాయ్ చేస్తాను.ఈయన తెరకెక్కిస్తున్న “దోచేవారెవరురా” కూడా అంతే ఎంటర్‌టైనింగ్‌గా ఉంటుందని నమ్ముతున్నాను.

ఈ సినిమా టీజర్ విడుదల చేయడం ఆనందంగా ఉంది’ అని తెలిపారు.

అన్ని కార్యక్రమాలు పూర్తిచేసి ఆగస్టులో సినిమాను విడుదల చేస్తామని తెలిపారు మేకర్స్.

సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే తెలియజేయనున్నారు యూనిట్.

బ్యానర్: IQ క్రియేషన్స్ దర్శకుడు: శివనాగేశ్వరరావు, నిర్మాత: బొడ్డు కోటేశ్వరరావు,PRO: లక్ష్మీ నివాస్

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube