ఒంటి చేత్తో బాలీవుడ్ పరువు నిలబెడుతున్న కింగ్ ఖాన్.. ఎంతైనా రాజు రాజే!

కొద్దీ రోజుల క్రితం బాలీవుడ్ ఇండస్ట్రీ హిట్ లేక సతమతం అయ్యింది.ఒకవైపు పక్క ఇండస్ట్రీలు అయిన మన సౌత్ భాషలు పాన్ ఇండియా లెవల్లో సూపర్ హిట్స్ అందుకుంటూ 1000 కోట్ల ప్రాజెక్టులను మన ఖాతాలో వేసుకుంటుంటే బాలీవుడ్ మాత్రం 100 కోట్ల సినిమాలు కూడా చేయలేక ఘోరంగా విమర్శలు ఎదుర్కున్న విషయం తెలిసిందే.

 Shahrukh Khan And Atlee Jawan Movie Collections, Jawan Movie, Shahrukh Khan, Atl-TeluguStop.com

అయితే అలాంటి తరుణంలో పఠాన్ సినిమా( Pathaan Movie )తో షారుఖ్ ఖాన్( Shahrukh Khan ) ప్రేక్షకుల ముందుకు వచ్చి బాలీవుడ్ కు కలగా మిగిలి పోయిన 1000 కోట్ల ప్రాజెక్ట్ ను ఇండస్ట్రీకి ఇచ్చాడు.దీంతో బాలీవుడ్ బాద్షా నిజంగానే బాద్షా అనిపించుకున్నాడు.ఈయన బాలీవుడ్ ఇండస్ట్రీ తీవ్రంగా ప్లాపులతో సతమతం అవుతున్న సమయంలో పఠాన్ వంటి హిట్ తో తనకు సూపర్ హిట్ అందించుకోవడమే కాకుండా ఇండస్ట్రీకి కూడా హిట్ ఇచ్చాడు.

మరి అలాంటి కింగ్ ఖాన్ తాజాగా జవాన్ సినిమాతో( Jawan Movie ) నిన్న సెప్టెంబర్ 7న ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.రాజే తన రాజ్యాన్ని కాపాడు కోవడానికి సైనికుడిగా వస్తాడనే మాటను నిజం చేసాడు.ఇక పఠాన్ తర్వాత జవాన్ తో వచ్చి ఈ సినిమాను కూడా మళ్ళీ 1000 కోట్ల ప్రాజెక్ట్ గా నిలబెట్టడానికి రెడీ అయ్యాడు.

నిన్న రిలీజ్ అయినా ఈ సినిమా పాజిటివ్ బజ్ తో దూసుకు పోతుంది.మిగిలిన హీరోలు 100 కోట్లు తెచుకోవడానికే కష్టపడుతుంటే షారుఖ్ ఖాన్ ఒంటి చేత్తో అదరగొడుతున్నాడు.

పఠాన్ తర్వాత జవాన్ కూడా 1000 కోట్ల క్లబ్ లో చేరే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి.ఇదే జరిగితే 7 నెలల్లోనే రెండు 1000 కోట్ల ప్రాజెక్టులు సాధించిన హీరోగా షారుఖ్ ఖాన్ చరిత్రలో నిలిచి పోతారు.

మరి ఈ సినిమా వీకెండ్ గడిచే సమయానికి ఏ రేంజ్ లో రాబడుతుందో చూడాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube