ఈ మధ్యకాలంలో సినిమా ఇండస్ట్రీలో వరుసగా విషాదాలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి.ఒకరి తర్వాత ఒకరు సినిమా ఇండస్ట్రీలో సెలబ్రిటీలు మరణిస్తూనే ఉన్నారు.
సెలబ్రిటీల మరణంతో వారి కుటుంబాలు వీధిన పడుతుండగా మరికొందరి జీవితాలు అతలాకుతలమవుతున్నాయి.అలా ఆ ప్రముఖ బుల్లితెర నటి( Serial Actress ) అతి చిన్న వయసులోనే తన భర్తను కోల్పోయింది.
అందులోను పెళ్లయిన ఏడాదికే భర్త మరణించడంతో ఆ నటి ఆ బాధ నుంచి తేరుకోలేకపోతోంది.ఇంతకీ ఆ నటి ఎవరు అసలు ఏం జరిగింది అన్న వివరాల్లోకి వెళితే.
తమిళ బుల్లితెర నటి శృతి షణ్ముగప్రియ( Shruti Shanmuga Priya ) జీవితంలో తీరని విషాదం చోటు చేసుకున్న విషయం తెలిసిందే.

శృతి భర్త అరవింద్ శేఖర్( Arvind Shekar ) ఆగస్టు 2న గుండెపోటుతో మృతి చెందారు.దాంతో ఒక్కసారి గా ఆమె ఇంట తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి.కాగా శృతి, అరవింద్ శేఖర్ ఇద్దరు పెళ్లికి ముందే కొన్నేళ్లపాటు డేటింగ్‌లో ఉన్నారు.
గత ఏడాది మే నెలలో ఈ లవ్ బర్డ్స్ పెళ్లి చేసుకుని భార్యభర్తలుగా మారారు.పెళ్లయిన ఏడాదికే భర్త చనిపోవడంతో శృతి గుండెలవిసేలా రోదిస్తోంది.తన భర్త మరణ వార్తను ఆమె జీవించుకోలేకపోతోంది.ఇకపోతే శృతి కెరియర్ విషయానికి వస్తే.
ఆమె మొదట నటస్వరం సీరియల్( Nataswaram )తో బుల్లితెర పైకి ఎంట్రీ ఇచ్చింది.

ఆ తరువాత వాణి రాణి, కల్యాణ పరిసు, పొన్నుచల్, భారతీ కన్నమ్మ వంటి పలు హిట్ సీరియల్స్ లో నటించింది.సీరియల్స్ చేస్తున్న సమయంలో బాడీ బిల్డర్ అరవింద్ శేఖర్‌తో లవ్‌లో పడ్డ ఈమె అతడితో కలిసి రీల్స్ చేస్తూ ఉండేది.వీరిని అభిమానులు ముచ్చటైన జంటగా అభివర్ణించేవారు.
ఇంత చిన్న వయసులో అరవింద్ మరణించడంతో అభిమానులు సోషల్ మీడియా( Social Media ) వేదికగా తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నారు.అతడి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నారు.
ప్రస్తుతం ఈ జంటకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో అభిమానులు శృతికి ధైర్యం చెబుతున్నారు.శేఖర్ మృతి పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.