యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్( Prashanth Neel ) దర్శకత్వం లో రూపొందుతున్న చిత్రం సలార్.ఈ సినిమా ను రెండు పార్ట్ లుగా విడుదల చేయబోతున్నారు.
అంతే కాకుండా ఈ సినిమా లో ప్రభాస్ ద్వి పాత్రాభినయం అనే విషయం తెల్సిందే.హీరోయిన్ గా శృతి హాసన్ నటిస్తోంది.
కేజీఎఫ్ సినిమా తో దర్శకుడు ప్రశాంత్ నీల్ మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాడు.అంతే కాకుండా పాన్ ఇండియా రేంజ్ లో స్టార్ డైరెక్టర్ అనే మంచి ఇమేజ్ ను సొంతం చేసుకున్నాడు.
దాంతో సలార్ సినిమా షూటింగ్ ప్రారంభం అయినప్పటి నుండే అంచనాలు ఆకాశాన్ని తాకాయి.

సలార్( Salaar ) ను ఇంగ్లీష్ ప్రేక్షకుల అభిరుచికి కూడా తగ్గట్లుగా భారీ ఎత్తున విడుదల చేయాలని ప్లాన్ చేశారు.ఈ సినిమాను హిందీతో పాటు అన్ని ఇండియన్ భాష ల్లో విడుదల చేయడం కన్ఫర్మ్ అయింది.కానీ ఇంగ్లీష్ లో ఈ సినిమా ను విడుదల చేయడం సాధ్యం కాకపోవచ్చు అంటున్నారు.
ఇండియా లో విడుదల అయిన సమయంలో ఇంగ్లీష్ లో విడుదల అవ్వక పోవచ్చు.

ఎందుకంటే ఆ సమయంలో హాలీవుడ్ ప్రాజెక్ట్ లు ఉండటంతో పాటు ఇంగ్లీష్ లో విడుదల చేయాలి అంటే ఇక్కడ మినిమం టాక్ రావాల్సి ఉంది.సలార్ సినిమా కు ఇక్కడ మంచి టాక్ వస్తేనే అక్కడ విడుదల అన్నట్లుగా మేకర్స్ భావిస్తున్నారు .అందుకే సలార్ సినిమా పై భారీ అంచనాలు ఉన్నా కూడా వెంటనే ఇంగ్లీష్ లో విడుదల చేయడానికి సాహసం చేయడం లేదు.హీరోగా ప్రభాస్ కు ఇది చాలా ప్రతిష్టాత్మకం అనడంలో సందేమం లేదు.ఎందుకంటే సాహో.రాధేశ్యామ్ ఇంకా ఆదిపురుష్( Adipurush ) సినిమాలు నిరాశ పరిచాయి.కనుక సలార్ సినిమా పై చాలా ఆశలే పెట్టుకుని ప్రభాస్ వెయిట్ చేస్తున్నాడు.








