Senior Heros Young Directors: సీనియర్ హీరోలు కూడా యంగ్ డైరెక్టర్లవైపే మొగ్గు చూపుతున్నారు… విషయం ఇదే! 

తరం మారింది.ఆలోచనలు కూడా మారాయి.

 Senior Heros Targets Only Young Directors Venkatesh Balakrishna Details-TeluguStop.com

ఇప్పుడు వస్తున్న సినిమాలలోని కంటెంట్ నచ్చితేగాని సినిమాలను చూడడంలేదు నేటి సినిమా ప్రేక్షకులు. పైగా ఈ ఓటిటిలు వచ్చిన తరువాత ఈ మార్పు చాలా బాగా కనిపిస్తోంది.

అందుకే చిన్నా చితకా హీరోలనుండి పెద్ద పెద్ద హీరోల వరకు అందరూ ఇపుడు యంగ్ డైరెక్టర్ల వైపే ( Young Directors ) మొగ్గు చూపుతున్నారు.ఎందుకంటే వారి ఆలోచనలు కొత్తగా ఉంటాయి.

వారి ఆలోచనలు ఈ జనరేషన్ కు తగ్గట్టుగా ఉంటాయి.అయితే ఈ క్రమంలో పాత డైరెక్టర్లు కాస్త వెనకబడ్డారనే చెప్పుకోవాలి.

అయితే ఒక స్టోరీని తెరపైకి ఎక్కించడంలో పాత డైరెక్టర్లు విఫలం అవరు.కానీ కొత్తవారి వద్ద కాస్త జాగ్రత్తగా వుండాలి.కారణం ఏదైనా ప్రస్తుతం మాత్రం స్టార్ హీరోలు( Star Heros ) కొత్త డైరెక్టర్లతో పని చేయడానికి ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు అనడంలో ఎటువంటి సందేహమూ లేదు.అంతేకాకుండా వాళ్లతో సినిమాలు చేయడం వల్ల మార్కెట్ మరింత పెరుగుతుందనే ఆలోచనలో ఉన్నారని వినికిడి.

Telugu Anil Ravipudi, Sailesh Kolanu, Jailer, Saindhav, Senior Heros, Venkatesh,

ఇన్నోవేటివ్ ఆలోచనలు, మేకింగ్ స్టయిల్, ప్రజెంటేషన్ విషయంలో కొత్త డైరెక్టర్లు కాస్త మెరుగ్గా సినిమాలను తెరకెక్కించడంతో వారి మేకింగ్ కు ఫిదా అయిపోతున్నారు మన సీనియర్ హీరోలు.( Senior Heros ) దానికి ఉదాహరనే రీసెంట్ గా వచ్చిన సైంధవ్ సినిమా( Saindhav Movie ) టీజర్.అవును, సాధారణంగా వెంకీ సినిమాపై ఉండే అంచనాల కంటే సైంధవ్‌పై డబుల్ ఎక్స్‌పెక్టేషన్స్ పెరిగాయంటే దానికి డైరెక్టర్ శైలేష్ కొలను( Director Sailesh Kolanu ) అని చెప్పుకోవడంలో సందేహం లేదు.ఎందుకంటే ఈ సినిమా మేకింగ్ కొత్తగా ఉంది.

ఇప్పటి వరకు వెంకటేష్‌ను( Venkatesh ) ఏ దర్శకుడు చూపించని విధంగా ప్రజెంట్ చేసారు శైలేష్ కొలను.

Telugu Anil Ravipudi, Sailesh Kolanu, Jailer, Saindhav, Senior Heros, Venkatesh,

ఇక ఇక్కడ బాలయ్య గురించి మాట్లాడుకోవాలి.బాలకృష్ణ( Balakrishna ) అంటేనే ఊరమాస్, క్లాస్ అన్ని కలగలుపుకొని ఉంటాయి.కానీ భగవంత్ కేసరి( Bhagavanth Kesari ) ట్రైలర్ చూస్తే అందులో కాస్త కొత్తదనం వుంటుంది.

అందుకే బాలయ్యకు మామూలుగా ఉండే మార్కెట్ కంటే దీనికి డబుల్ బిజినెస్ జరిగింది.బాలయ్య యాక్షన్ కు అనిల్ రావిపూడి( Anil Ravipudi ) డైరెక్షన్ తోడయ్యే సరికి సినిమా రేంజ్ పెరిగిపోయిందని విశ్వసనీయ వర్గాల సమాచారం.

ఇక ఇలా టాలీవుడ్ లో మాత్రమే కాదు అటు తమిళంలో లోకేష్ కనరాజ్, నెల్సన్ లాంటి యంగ్ డైరెక్టర్స్ హవా కనిపిస్తుంది.వాళ్ల మేకింగ్‌తోనే విక్రమ్, జైలర్ వంటి వందల కోట్లు వసూలు చేసే సినిమాలు వచ్చాయి.

ఇక మా తెలుగు దర్శకుడు సందీప్ రెడ్డి వంగా గురించి చెప్పాల్సిన పనిలేదు.మనోడు ఏకంగా బాలీవుడ్లో దూసుకుపోతున్న సంగతి అందరికీ విదితమే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube