సిరిసిల్ల పురపాలక సంఘం టౌన్ ప్లానింగ్ అధికారి అన్సార్( Siricilla Town Planning Officer Ansar ) బుధవారం మున్సిపల్ కమిషనర్ గా అదనపు బాధ్యతలను స్వీకరించారు.సిరిసిల్ల పురపాలక సంఘం టౌన్ ప్లానింగ్ అధికారి అన్సార్ కు మున్సిపల్ కమిషనర్ గా అదనపు బాధ్యతలను అప్పగిస్తూ ఈ నెల 17 వ తేదీన ( మంగళవారం ) జిల్లా కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు.
సిరిసిల్ల మున్సిపల్ కమిషనర్ గా పని చేస్తున్న మహమ్మద్ అయాజ్ అనారోగ్య కారణాలతో రెండు నెలల వైద్య సెలవులు పెట్టడంతో మున్సిపల్ కమిషనర్ గా అదనపు బాధ్యతలను అన్సార్ కు అప్పగించారు.సిరిసిల్ల పురపాలక సంఘం( Rajanna Sircilla )లో టౌన్ ప్లానింగ్ బాధ్యతలు నిర్వహిస్తున్న అన్సార్ కు సమర్థ అధికారిగా పేరుంది.సిరిసిల్ల టౌన్ ప్లానింగ్ బాధ్యతలతో పాటు జిల్లా పట్టణ, గ్రామీణ ప్రణాళిక అధికారిగా, వీటిడిఎ సెక్రెటరీ గా అన్సార్ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.గతంలో వేములవాడ ఇంచార్జీ మున్సిపల్ కమిషనర్ గా కూడ ఈయన సేవలు అందించారు.
తాజాగా సిరిసిల్ల మున్సిపల్ కమిషనర్ గా అన్సర్ బాధ్యతలు చేపట్టడంతో వేములవాడ ,సిరిసిల్ల పురపాలక సంఘాలకు మున్సిపల్ కమిషనర్ గా పనిచేసిన అధికారిగా ప్రత్యేక గుర్తింపును ఆయన సొంతం చేసుకున్నారు.