నందమూరి నటసింహం బాలకృష్ణ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నటువంటి అన్ స్టాపబుల్ కార్యక్రమం ఎంతో మంచి ఆదరణ సంపాదించుకొని దూసుకుపోతుంది.ఇప్పటికి మొదటి సీజన్ ఎంతో విజయవంతం కాగా రెండవ సీజన్ కూడా అంతకుమించి ఉండేలా ప్లాన్ చేశారు.
ఇక రెండవ సీజన్లో కేవలం సినీ సెలబ్రిటీలను మాత్రమే కాకుండా రాజకీయ నాయకులను కూడా ఆహ్వానించారు.ఇక ఈ కార్యక్రమం ప్రస్తుతం ఆరు ఎపిసోడ్లను పూర్తి చేసుకుంది.6 వ ఎపిసోడ్లో భాగంగా సీనియర్ నటిమనులు అయినటువంటి జయసుధ జయప్రదతో పాటు యంగ్ హీరోయిన్ రాశి ఖన్నా కూడా హాజరయ్యారు.
ఈ కార్యక్రమంలో భాగంగా బాలకృష్ణ వీరితో కలిసి ఎంతో సరదాగా ఆటలు ఆడుతూ డాన్సులు చేస్తూ వీరి దగ్గర నుంచి పలు ఆసక్తికరమైన విషయాలకు సమాధానాలను కూడా రాబట్టారు.
ఈ క్రమంలోనే బాలకృష్ణ జయసుధను ప్రశ్నిస్తూ కంగనా రనౌత్ కి పద్మ అవార్డు వచ్చింది.మరి నీకెందుకు రాలేదు అని ప్రశ్నించారు.ఈ ప్రశ్నకు జయసుధ సమాధానం చెబుతూ.కంగనాకు పద్మశ్రీ ఇవ్వడాన్ని మేము తప్పు పట్టలేదు ఆమె నటించిన పది సినిమాలకే తనకు పద్మ అవార్డు వచ్చింది.
కానీ మేము ఎన్నో సినిమాలలో నటించిన ప్రభుత్వం మమ్మల్ని ఇంకా గుర్తించలేదని ఈమె తన ఆవేదన అసహనం వ్యక్తం చేశారు.
ఇక జయసుధ మాటలకు జయప్రద కూడా స్పందిస్తూ మనం గౌరవం పొందాలి కానీ.అడగడం ద్వారా రావడం కాదు అంటూ పద్మ అవార్డుల విషయంలో వీరిద్దరూ తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు.ఇక ఈ విషయం గురించి జయసుధ మాట్లాడుతూ.
గిన్నిస్ రికార్డులలో చోటు సంపాదించుకున్న మహిళ దర్శకురాలు విజయనిర్మలను కూడా మర్చిపోతున్నారని ఈమె గుర్తు చేశారు.ఇలా ఇండస్ట్రీకి ఎన్నో సేవలు అందించినటువంటి వారిని దక్షిణాది ప్రభుత్వం గుర్తించకపోవడం బాధాకరం అంటూ ఈ సందర్భంగా పద్మ అవార్డుల విషయంలో తమకు అన్యాయం జరిగిందంటూ చెప్పకనే చెప్పేశారు.