Aamani Casting Couch : అది చూడడానికి డ్రెస్ మొత్తం విప్పేయమన్నారు.. ఫస్ట్ టైం క్యాస్టింగ్ కౌచ్ పై స్పందించిన సీనియర్ నటి ఆమని..!!

సీనియర్ నటి ఆమని ( Aamani ) అంటే తెలుగు సినీ ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేని పేరు.ఈమె తన అందం అభినయంతో అప్పటి సినీ ప్రేక్షకులను కట్టిపడేసింది.

 Senior Actress Aamani React Casting Couch-TeluguStop.com

అంతేకాదు ఈమె నటించిన అప్పటి సినిమాలు ఇప్పుడు టీవీలలో వచ్చినా కూడా చాలామంది కుటుంబ కథా ప్రేక్షకులు టీవీలకు అతుక్కొని మరీ చూస్తారు అంత బాగుంటాయి ఈ హీరోయిన్ చేసిన సినిమాలు.

Telugu Kollywood, Senioractress, Tollywood-Movie

ఆమని మొదటిగా జంబలకడిపంబ ( Jambalakadipamba ) సినిమాతో తెలుగు లో సినీ రంగ ప్రవేశం చేసింది.ఇక శుభలగ్నం సినిమాలో ఆమని పాత్రకి మంచి రెస్పాన్స్ వచ్చింది.మావిచిగురు, అమ్మ దొంగ,శుభసంకల్పం, ఘరానా బుల్లోడు,ఆ నలుగురు, శ్రీవారి ప్రియురాలు, అమ్మ దీవెన వంటి ఎన్నో సినిమాల్లో నటించింది.

అయితే పెళ్లయ్యాక సినిమాలకు దూరంగా ఉండి రీ ఎంట్రీ లో కూడా అమ్మ,అత్త పాత్రల్లో నటిస్తూ బిజీ అయిపోయింది.

ఈమె చావు కబురు చల్లగా,మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ( Most eligible bachelor ) ,శ్రీనివాస కళ్యాణం, చందమామ కథలు, వినరో భాగ్యం విష్ణు కథ వంటి సినిమాల్లో నటించింది.

అయితే అలాంటి సీనియర్ నటి ఆమని తాజాగా క్యాస్టింగ్ కౌచ్ పై నోరు విప్పింది.గతంలో సోషల్ మీడియా అందుబాటులో లేదు కాబట్టి అప్పటి హీరోయిన్స్ ఎదుర్కొన్న చేదు సంఘటనలు అంతగా బయటపడలేదు.

కానీ ఇప్పుడు సోషల్ మీడియా చాలా అందుబాటులో ఉంది.

Telugu Kollywood, Senioractress, Tollywood-Movie

అందుకే చీమ చిటుక్కుమన్నా కూడా మీడియాలో ఇట్టే వైరల్ అవుతుంది.ఇక గతంలో నన్ను ఒక సినిమాలో స్విమ్ సూట్ వేసుకొని స్విమ్మింగ్ చేయమని అన్నారు.అయితే నేను ఈ పాత్రకి ఒప్పుకునే ముందు డైరెక్టర్ నీ డ్రెస్ మొత్తం విప్పేయ్యు నీ ఒంటి మీద ఎక్కడైనా స్ట్రెచ్ మార్క్స్ ఉన్నాయేమో చూస్తాను అన్నాడు.

దాంతో నాకు ఈ సినిమా వద్దు ఆ క్యారెక్టర్ వద్దు అంటూ అక్కడ నుండి వచ్చేసాను.

అయితే ఇది జరిగింది టాలీవుడ్ లో కాదు కోలీవుడ్ లో నాకు ఈ చేదు అనుభవం ఎదురయింది.

అలాగే మొదట్లో నాకు క్యాస్టింగ్ కౌచ్( Casting couch ) అంటే పెద్దగా తెలియదు.అంతేకాకుండా దర్శక నిర్మాతలు అప్పట్లో తమ మేనేజర్లను మీకు డైరెక్టర్ స్టోరీ చెబుతానన్నారు ఒకసారి ఆయన రూమ్ కి రండి అని పిలిచేవారు.

కానీ అసలు వాళ్ళు ఏమి ఆశించి అడుగుతున్నారో నాకు అర్థం అయ్యేది కాదు.

Telugu Kollywood, Senioractress, Tollywood-Movie

అయితే కొంతమంది మాత్రం మీ మమ్మీ వద్దు ఒక్కరే రండి అని డైరెక్ట్ గా చెప్పడంతో వీళ్ళు నా నుండి కమిట్మెంట్ కోరుకుంటున్నారు అని అర్థమై చాలా సినిమాలను వదులుకున్నాను.అయితే ఇలా చిన్నచిన్న సంస్థల వాళ్ళు చేశారు కానీ పెద్ద పెద్ద సంస్థల వాళ్ళు ఇలా హీరోయిన్లను వేధించలేదు అంటూ ఆమని ( Aamani ) క్యాస్టింగ్ కౌచ్ పై మాట్లాడిన మాటలు ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube