పవన్ కళ్యాణ్ భూమిక ( Pawan kalyan-Bhumika ) ల కాంబినేషన్ లో వచ్చిన ఖుషి సినిమా టైటిల్ ని మళ్లీ విజయ్ దేవరకొండ సమంత కాంబినేషన్ లో వచ్చే సినిమాకి టైటిల్ గా పెట్టుకున్నారు.అయితే ఈ సినిమాకి టైటిల్ గా పెట్టే విషయంలో ఫ్యాన్స్ మధ్య చాలానే గొడవలు వినిపించాయి.
కానీ వాటిని దాటుకొని విజయ్ దేవరకొండ సమంత ( Vijay devarakonda-Samantha ) నటించిన సినిమాకి ఖుషి టైటిల్ ని ఫిక్స్ చేశారు.అయితే తాజాగా ఖుషి సినిమా ట్రైలర్ ని గ్రాండ్ గా రిలీజ్ చేశారు చిత్ర యూనిట్.
అయితే ఈ ట్రైలర్ ని చూస్తూ ఉంటే పూర్తిగా సమంత నాగచైతన్య ల ప్రేమ పెళ్లిలా ఉంది అంటూ కొంతమంది నెటిజన్స్ కామెంట్లు పెడుతున్నారు.
ఎందుకంటే ఇందులో విజయ్ దేవరకొండ సమంత ప్రేమించుకున్నట్లే నాగచైతన్య సమంతలు కూడా ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.అలాగే నాగచైతన్య సమంత విడిపోవడానికి కారణం వీరి జాతకాలు కలవలేదని గతంలో వేణు స్వామి ( Venuswamy ) అనుకున్నట్లే జాతక దోషం వల్లే వీరిద్దరూ విడిపోయారు.అయితే ఖుషి సినిమాలో కూడా విజయ్ దేవరకొండ సమంత ఇద్దరు జాతక దోషం వల్ల విడిపోతారు.
అంతేకాకుండా సమంత నాగచైతన్య విడిపోయిన టైంలో ఎన్నో రూమర్స్ తెరపై వినిపించాయి.అలాగే ఖుషి సినిమా ( Khushi movie ) ట్రైలర్ లో కూడా సమంత విజయ్ దేవరకొండ మధ్యలో ఎన్నో గొడవలు, విభేదాలు వచ్చినట్లు ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది.అయితే ఈ సినిమా మొత్తం సమంత నాగచైతన్యల రియల్ స్టోరీ నేనని కొంతమంది ఈ ట్రైలర్ చూసిన నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.అయితే అసలు విషయం ఏంటి అన్నది సినిమా పూర్తిగా చూస్తే గానీ అర్థం కాదు.
ఏది ఏమైనప్పటికీ ఖుషి సినిమా ట్రైలర్ చూస్తే కాస్త అటూ ఇటుగా సమంత నాగచైతన్య జీవితాన్ని చూసినట్లే అనిపిస్తోందని అక్కినేని అభిమానులు కామెంట్లు పెడుతున్నారు.మరి ఇదే గనక నిజమైతే అక్కినేని ఫ్యాన్స్, అక్కినేని కుటుంబ సభ్యులు ఈ సినిమాపై ఏ విధంగా స్పందిస్తారు అనేది సినిమా విడుదలయ్యాక తెలుస్తుంది.
ఇక ఖుషి సినిమా ( Khushi movie ) సెప్టెంబర్ 1న విడుదల కాబోతోంది.