టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా( Sandeep Reddy Vanga ) అర్జున్ రెడ్డి, కబీర్ సింగ్, యానిమల్ సినిమాలతో సక్సెస్ సాధించి ప్రభాస్ హీరోగా స్పిరిట్ అనే భారీ సినిమాను ప్లాన్ చేస్తున్నారు.ప్రభాస్ సినిమా గురించి సందీప్ రెడ్ది వంగా చెప్పిన విషయాలు తెగ వైరల్ అవుతున్నాయి.
కొన్ని సంవత్సరాల క్రితం ప్రభాస్ నుంచి నాకు ఒక సినిమా ఆఫర్ వచ్చిందని సందీప్ రెడ్డి వంగా వెల్లడించడం గమనార్హం.
హాలీవుడ్( Hollywood ) లో హిట్టైన ఒక సినిమాను తెలుగులో చేద్దామా అని ప్రభాస్ నన్ను అడిగారని సందీప్ రెడ్డి వంగా వెల్లడించారు.ఆ సమయంలో మనకు రీమేక్స్ వద్దు రీమేక్ కంటే ఒరిజినల్ కథలే బాగా సెట్ అవుతాయని నేను చెప్పానని ఆయన పేర్కొన్నారు.మంచి ఐడియా వస్తే తప్పకుండా సంప్రదిస్తానని ప్రభాస్ కు చెప్పానని సందీప్ రెడ్డి వంగా పేర్కొన్నారు.
యానిమల్ షూటింగ్ సమయంలో ఒక ఐడియా వస్తే ప్రభాస్ ను సంప్రదించానని ఆయన అన్నారు.
ప్రభాస్( Prabhas ) కు నేను చెప్పిన ఐడియా నచ్చడంతో ఆయన వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని సందీప్ రెడ్డి వంగా కామెంట్లు చేశారు.స్పిరిట్ సినిమాలో ప్రభాస్ నిజాయితీ ఉన్న పోలీస్ ఆఫీసర్ గా కనిపిస్తారని ఆయన చెప్పుకొచ్చారు.ప్రభాస్ తనను ఇబ్బంది పెడితే ఏ విధంగా రియాక్ట్ అవుతాడనేది ప్రధానంగా ఈ సినిమాలో చూపించామని సందీప్ రెడ్డి వంగా పేర్కొన్నారు.60 శాతం రైటింగ్ పూర్తైందని ఆయన కామెంట్లు చేశారు.300 కోట్ల రూపాయలకు పైగా బడ్జెట్ తో ఈ సినిమాను తెరకెక్కించాలని అనుకుంటున్నామని సందీప్ రెడ్డి వంగా చెప్పుకొచ్చారు.ప్రభాస్ సినిమాపై అంచనాలు అంతకంతకూ పెరుగుతున్నాయని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.6 నెలలకు ఒక సినిమాతో స్టార్ హీరో ప్రభాస్ ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు.