నక్కతోక తొక్కిన సమంత.. ఆ ప్రాజెక్టులో నటించే అవకాశం దక్కించుకున్న నటి?

టాలీవుడ్ ఇండస్ట్రీలో అగ్ర తారగా కొనసాగిన సమంత అనంతరం తమిళ సినిమాలలో కూడా అవకాశాలను అందుకొని దక్షిణాది సినిమా ఇండస్ట్రీలో అగ్రతారగా పేరు సంపాదించుకున్నారు.ఇలా తెలుగు తమిళ భాషలలో వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉన్న సమంత ది ఫ్యామిలీ మెన్ 2 వెబ్ సిరీస్ ద్వారా హిందీ ప్రేక్షకులకు పరిచయమయ్యారు.

 Samantha To Act In Citadel Indian Spin Off Version Details, Samantha,the Family-TeluguStop.com

ఇలా ఈ వెబ్ సిరీస్ తో బాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతో మంచి క్రేజ్ సంపాదించుకున్న ఈమె అనంతరం పుష్ప సినిమాలో ఐటమ్ సాంగ్ ద్వారా మరోసారి పెద్ద ఎత్తున బాలీవుడ్ ప్రేక్షకులను సందడి చేశారు.

ఈ క్రమంలోనే సమంతకు మంచి క్రేజ్ రావడంతో ఈమెకు భారీ ప్రాజెక్టులలో నటించే అవకాశాలు వస్తున్నట్లు తెలుస్తోంది.

ఇప్పటికే హాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా అవకాశాలు అందుకుంటున్నారు.ఇకపోతే తాజాగా సమంత మరో క్రేజీ ప్రాజెక్టులో నటించే అవకాశాన్ని అందుకుంది.

హాలీవుడ్‌లో ప్రియాంక చోప్రా ‘సిటాడెల్’ పేరుతో ఓ వెబ్ సిరీస్ చేస్తోన్న విషయం మనకు తెలిసిందే.రుస్సో బ్రదర్స్ రూపొందిస్తున్న ఈ వెబ్ సిరీస్, అత్యంత భారీ బడ్జెట్ వెబ్ సిరీస్ లలో రెండో స్థానంలో నిలిచింది.

Telugu Indiansnip, Citadel, Priyanka Chopra, Russo Brothers, Samantha, Samanthac

ఇలా ఎంతో ప్రతిష్టాత్మకమైన ఈ వెబ్ సిరీస్ లో ప్రియాంక చోప్రా నటించగా ఇదే వెబ్ సిరీస్ ను ఇండియన్ స్నిప్ ఆఫ్ వెర్షన్ చేయడం కోసం సౌత్ ఇండియా స్టార్ యాక్ట్రెస్ సమంతను ఎంపిక చేసినట్లు తెలుస్తుంది.ది ఫ్యామిలీ మెన్ 2 వెబ్ సిరీస్ తో అద్భుతమైన నటనతో అందరిని మెప్పించిన సమంత ఏకంగా సిటాడెల్’ ఇండియన్ స్నిప్ ఆఫ్ వెర్షన్ లో నటించే అవకాశాన్ని అందుకుందని, ఈ వెబ్ సిరీస్ లో నటించడం కోసం సమంతకి భారీ రెమ్యూనరేషన్ కూడా ఆఫర్ చేసినట్టు తెలుస్తోంది.మరి సమంత గురించి వస్తున్నటువంటి ఈ వార్తలలో ఎంతవరకు నిజముందో తెలియదు కానీ ప్రస్తుతం ఈ వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube