Samantha: తల్లితో కలిసి న్యూయార్క్ కు బయలుదేరిన సమంత.. అందుకోసమేనా?

తెలుగు సినీ ప్రేక్షకులకు టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత( Samantha ) గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.సమంత వరుసగా సినిమాలలో నటిస్తూ దూసుకుపోతున్న విషయం తెలిసిందే.

 Samantha Off To Newyork With Her Mother-TeluguStop.com

ఒకవైపు సినిమాలలో నటిస్తూనే మరోవైపు కమర్శియల్ యాడ్స్ లో నటిస్తూ దూసుకుపోతోంది.ఇది ఇలా ఉంటే సమంత గత కొద్దిరోజులుగా మయోసైటీస్( Myositis ) అనే వ్యాధితో బాధపడుతున్న విషయం తెలిసిందే.

ప్రస్తుతం ఆ చికిత్స నిమిత్తం సినిమాలకు ఏడాది పాటు బ్రేక్ ఇవ్వనున్నట్లు ఇటీవలే ప్రకటించింది సమంత.కాగా సామ్ ఇటీవలె తాను కమిట్ అయిన సినిమాలను పూర్తి చేసిన విషయం తెలిసిందే.

Telugu Samantha, Khusi, Mother, Newyork, Samantha Mother, Samantha York, Tollywo

అలాగే మరికొన్ని సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వగా ఆ మూవీ నిర్మాతలను పిలిచి మరి ఆ అడ్వాన్స్ లను వెనక్కిచ్చేసిన విషయం తెలిసిందే.ఇకపోతే సమంత తాజాగా నటించిన చిత్రం ఖుషి.( Khusi Movie ) ఇందులో విజయ్ దేవరకొండ( Vijay Devarakonda ) హీరోగా నటించిన విషయం తెలిసిందే.కాగా ఈ మూవీ సెప్టెంబర్ 1 న విడుదల కానుంది.

కాగా ప్రస్తుతం చిత్ర బృందం ప్రమోషన్స్ లో భాగంగా బిజీబిజీగా ఉన్న విషయం తెలిసిందే.సినిమా ప్రమోషన్స్ లో పాల్గొనాల్సిన సమంత ఉన్నఫలంగా తన తల్లితో కలిసి న్యూయార్క్( New York ) వెళ్లిపోవడం అన్నది తెలుగు సినిమా ఇండస్ట్రీలో హాట్ టాపిక్ మారింది.

కాగా ఈ సినిమా విడుదల సమయం దగ్గర పడే కొద్దీ మేకర్స్ ఖుషి ప్రమోషన్స్ వేగవంతం చేస్తున్న సమయంలో సమంత ఇలా వెళ్లిపోవడం అన్నది హాట్ టాపిక్ గా మారింది.

Telugu Samantha, Khusi, Mother, Newyork, Samantha Mother, Samantha York, Tollywo

సమంత సడెన్ గా న్యూయార్క్ వెళ్ళిపోయింది.ఈ వార్త విన్న సమంత, విజయ్ దేవరకొండ అభిమానులు షాక్ కి గురయ్యారు.రెండు రోజుల క్రితమే సమంత ఖుషి మ్యూజికల్ కాన్సెర్ట్ లో పాల్గొని విజయ్ తో డాన్స్ కూడా చేసింది.

అయితే ఆమె న్యూయార్క్ వెళ్ళటం రూమర్ అని అందరూ భావించారు.కానీ సమంత నిన్న నైట్ న్యూయార్క్ తన తల్లితో( Samantha Mother ) కలిసి వెళ్ళింది.

మయోసైటీస్ వ్యాదికి ట్రీట్మెంట్ న్యూయార్క్ లో తీసుకోవడం కోసం తన తల్లితో కలిసి బయలుదేరి వెళ్ళింది.ఇంకో ఆరు నెలల దాకా సమంత న్యూయార్క్ లోనే ఉంటుంది.

సో ఇంక ఖుషి ప్రమోషన్స్ కి సమంత బై బై చెప్పినట్లే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube