గృహలక్ష్మి సీరియల్ వల్ల నా జీవితంలో ఎన్నో మార్పులు.. టీవీ నటుడు!

బొమ్మిరెడ్డిపల్లి పేర్రాజు ఈ పేరు వినగానే చాలామంది గుర్తుపట్టక పోవచ్చు కానీ గృహలక్ష్మి సీరియల్ తులసి మామ పాత్రలో నటిస్తున్నా పరంధామయ్య అనగానే ఇట్టే గుర్తుపట్టేస్తారు.అంతలా ఈ గృహలక్ష్మి సీరియల్ అతనికి మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది.అయితే ఈ సీరియల్ కంటే ముందుగా తెలుగు సినీ పరిశ్రమలో దాదాపు 30 సినిమాల్లో నటించినప్పటికీ సరిగా రాని గుర్తింపు స్టార్ మా లో ప్రసారం అవుతున్న గృహలక్ష్మి సీరియల్ తో దక్కింది.69 ఏళ్ల వయసులో కూడా బొమ్మిరెడ్డిపల్లి పేర్రాజు సీరియల్లో కామెడీగా, ఎమోషనల్ గా నటిస్తూ అందరి మన్ననలు అందుకుంటున్నరు.జిల్లాకు చెందిన బొమ్మిరెడ్డిపల్లి పేర్రాజు తాజాగా మీడియాతో ముచ్చటించారు.

 Sakshi Interview Movie And Tv Actor Bommireddipalli Perraju , Bommireddipalli Perraju, Intinti Gruhalakshmi, Interview With Bommireddipalli Perraju ,allu Arvind , Gruhalakshmi Serial, Tv Actor, Parandhamayya-TeluguStop.com

ఈ క్రమంలోనే పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.

బొమ్మిరెడ్డిపల్లి పేర్రాజు జిల్లాలోని కేంద్రంలో కానుకుర్తివారి వీధిలో పుట్టానని, 1969లో కోరుకొండ సైనిక్‌ స్కూల్‌ జాయిన్ అయిన తరువాత రెండేళ్ల పాటు చదివి, ఆ తరువాత అనివార్య కారణాల వల్ల మధ్యలోనే చదువు ఆపేశాను అని తెలిపారు బొమ్మిరెడ్డిపల్లి పేర్రాజు.మిత్రుడు నాలుగెస్సుల రాజుతో కలిసి మెట్రిక్యులేషన్‌ పూర్తిచేశానని,అనంతరం ఎంఆర్‌ కళాశాలలో ఇంటర్, బీకామ్‌ పూర్తిచేసి ఫ్రెండ్స్‌తో కలిసి ఢిల్లీ టూర్‌ వెళ్లినప్పుడు ఓ పత్రికలో వచ్చిన క్లిప్లింగ్‌ ఆధారంగా ఇండియన్‌ ఎయిర్‌ లైన్స్‌కు దరఖాస్తు చేయగా, ట్రాఫిక్‌ అసిస్టెంట్‌గా ఉద్యోగం వచ్చింది అని చెప్పుకొచ్చారు.

 Sakshi Interview Movie And Tv Actor Bommireddipalli Perraju , Bommireddipalli Perraju, Intinti Gruhalakshmi, Interview With Bommireddipalli Perraju ,Allu Arvind , Gruhalakshmi Serial, Tv Actor, Parandhamayya-గృహలక్ష్మి సీరియల్ వల్ల నా జీవితంలో ఎన్నో మార్పులు.. టీవీ నటుడు-,Top Story-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఆ తరువాత 28 ఏళ్ల పాటు వివిధ ప్రాంతాల్లో పనిచేసి హిందీ, తెలుగు, పంజాబీ భాషల్లో ప్రావీణ్యం సంపాదించానని తెలిపారు.

అప్పుడు సినిమా ఇండస్ట్రీ వాళ్లు ఢిల్లీ టూర్‌కి వచ్చినప్పుడు నాతో బాగా మాట్లాడేవారని, ఆ సమయంలో అల్లు అరవింద్‌ గారితో పరిచయం ఏర్పడడంతో వాలంటరీ రిటైర్‌మెంట్‌ తీసుకున్న తర్వాత హైదరాబాద్‌కి వచ్చి ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్‌ను కలవడంతో అల్లు అర్జున్‌ నటించిన హ్యాపీ చిత్రంలో నటించే అవకాశం వచ్చింది అని చెప్పుకొచ్చారు.ఆ తర్వాత స్టాలిన్, డాన్, హోమం, తదితర 30 చిత్రాలలో నటించానని తెలిపారు.అయితే దాదాపుగా 30 కి పైగా సినిమాలలో నటించినప్పటికీ రాని గుర్తింపు స్టార్‌ మాలో ప్రసారం అయ్యే ఇంటింటి గృహలక్ష్మిలో నటించడం వల్ల బాగానే గుర్తింపు దక్కింది అని తెలిపారు.

ఈ సీరియల్‌ నా జీవితానికి ఓ టర్నింగ్‌ పాయింట్‌ అని తెలిపారు బొమ్మిరెడ్డిపల్లి పేర్రాజు.అయితే ఇప్పటివరకు తాను దాదాపుగా 26 సీరియళ్లలో నటించానని అంతేకాకుండా, మూవీ ఆర్టిస్ట్‌ అసోసియేషన్‌లో లైఫ్‌ మెంబర్‌గా ఉన్నాను అని చెప్పు కొచ్చారు బొమ్మిరెడ్డిపల్లి పేర్రాజు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube