నోరు అదుపులో పెట్టుకోవాలంటూ వార్నింగ్ ఇచ్చిన సాయితేజ్.. నిహారికపై అలా కామెంట్ చేయడంతో?

మెగా డాటర్ నిహారిక( Niharika ) చైతన్యతో విడాకులు తీసుకున్న తర్వాత ఆమెపై సోషల్ మీడియా వేదికగా వచ్చిన ట్రోల్స్ అన్నీఇన్నీ కావు.విడాకులకు సంబంధించి నిహారికదే తప్పని చాలామంది కామెంట్లు చేశారు.

 Saitej Warning To Netizen About Niharika Details Here Goes Viral In Social Medi-TeluguStop.com

నిహారిక పలు వివాదాల్లో చిక్కుకోవడం వల్లే విడాకులు తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.అయితే నిహారిక మాత్రం తన వ్యక్తిగత జీవితానికి భంగం కలిగించేలా కామెంట్లు చేయవద్దని కోరారు.

Telugu Bro, Niharika, Sai Dharam Tej, Soul Satya, Tollywood, Virupaksha-Movie

అయితే సాయితేజ్( Sai Dharam Tej ) ప్రస్తుతం సోల్ ఆఫ్ స‌త్య( Soul of Satya ) అనే షార్ట్ ఫిల్మ్ లో నటిస్తుండగా ఇండిపెండెన్స్ డే కానుకగా ఈ షార్ట్ ఫిల్మ్ విడుదల కానుంది.ఈ షార్ట్ ఫిల్మ్ లో ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయని సమాచారం అందుతోంది.అయితే ఈ షార్ట్ ఫిల్మ్ గురించి నిహరిక స్పందిస్తూ ఈ షార్ట్ ఫిల్మ్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని చెప్పుకొచ్చారు.అయితే ఒక నెటిజన్ నిహారిక కామెంట్ గురించి స్పందిస్తూ వీటి మీద ఉన్న శ్రద్ధ కుటుంబం మీద లేకపాయె అని చెప్పుకొచ్చారు.

Telugu Bro, Niharika, Sai Dharam Tej, Soul Satya, Tollywood, Virupaksha-Movie

అయితే ఈ కామెంట్ సాయితేజ్ దృష్టికి రావడంతో “నోరు అదుపులో పెట్టుకో.వెంటనే కామెంట్ డిలీట్ చేయ్” అంటూ సాయితేజ్ వార్నింగ్ ఇచ్చారు.సాయితేజ్ వార్నింగ్ తో ఆ నెటిజన్ కామెంట్ ను డిలీట్ చేయడం జరిగింది.సాయితేజ్ తర్వాత ప్రాజెక్ట్ లపై మంచి అంచనాలు నెలకొన్నాయి.సాయితేజ్ విరూపాక్ష, బ్రో సినిమాలతో సక్సెస్ లను ఖాతాలో వేసుకున్నారు.సినిమా సినిమాకు సాయితేజ్ మార్కెట్ పెరుగుతోంది.

ప్రస్తుతం సాయితేజ్ రెమ్యునరేషన్ 10 కోట్ల రూపాయల రేంజ్ లో ఉందని తెలుస్తోంది.సాయితేజ్ ను అభిమానించే వాళ్ల సంఖ్య అంతకంతకూ పెరుగుతుండటం గమనార్హం.

సాయితేజ్ భవిష్యత్తు ప్రాజెక్ట్ లతో సైతం రికార్డులు క్రియేట్ చేయాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.సినిమా సినిమాకు సాయితేజ్ కు క్రేజ్ పెరుగుతోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube