స్పోర్ట్స్ స్టార్స్ బయోపిక్ లు చాలా కాలంలో బాలీవుడ్ లో తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.ముందుగా క్రికెటర్స్ జీవితాలపై పడిన బాలీవుడ్ దర్శకులు తరువాత ఇతర క్రీడలలో రాణిస్తున్న వారి జీవితాలలోకి ఎంట్రీ అయిపోయారు.
ఈ నేపధ్యంలో స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో నిజజీవిత కథలు వరుసగా తెరపైకి వస్తున్నాయి.తాజాగా బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్ బయోపిక్ బాలీవుడ్ లో ప్రేక్షకుల ముందుకి వచ్చింది.
సైనా నెహ్వాల్ పాత్రలో పరిణీతి చోప్రా నటించింది.ఇక సైనా పాత్ర కోసం ఆమె పూర్తిగా వర్క్ అవుట్స్ చేసి స్లిమ్ అయ్యింది.
అదే సమయంలో బ్యాడ్మింటన్ కూడా చాలా సీరియస్ గా నేర్చుకొని షూటింగ్ లో పాల్గొనడమే కాకుండా ఏకంగా ఆమె రూపాన్ని ఆహార్యంలోకి మారిపోయింది.సైనాని దగ్గరుండి చూసి ఆమె అలవాట్లు స్టైల్, మేనరిజమ్స్ అన్ని కూడా పరిణీతి చోప్రా నేర్చుకుంది.
ఇక ఆమె పడిన కష్టానికి ప్రతిఫలం వచ్చింది.
తాజాగా ప్రేక్షకుల ముందుకి వచ్చిన ఈ సినిమా హిట్ టాక్ సొంతం చేసుకోవడంతో పాటు విమర్శకుల ప్రశంసలు కూడా సొంతం చేసుకుంది.
తెరపై పరిణీతి చోప్రా ఎక్కడా కనిపించడం లేదని, సైనా నెహ్వాల్ మాత్రమే కనిపిస్తుందనే ప్రశంసలు దక్కించుకుంది.పరిణీతి కెరియర్ లో మరిచిపోలేని చిత్రంగా ఇది మిగిలిపోతుందని అంటున్నారు.
ఇప్పటి వరకు రెగ్యులర్ పాత్రలలో ఎక్కువగా కనిపించిన ఈ బ్యూటీ మొదటిసారి పూర్తిస్థాయిలో నటనకి స్కోప్ ఉన్న పాత్ర చేయడంతో ఎమోషన్స్ ని కూడా అద్బుతంగా పండించిందనే టాక్ ప్రేక్షకుల నుంచి వస్తుంది.దీంతో సైనా బయోపిక్ ఎంతో మంది క్రీడాకారులకి స్పూర్తినిచ్చే విధంగా ఉందని చెప్పొచ్చు.
సినిమా హిట్ టాక్ తెచ్చుకున్న కూడా నార్త్ ఇండియాలో కరోనా తీవ్రత ఎక్కువగా ఉంది.ఈ నేపధ్యంలో ఎంత వరకు కలెక్షన్స్ రాబడుతుంది అనేది చూడాలి.