“బాహుబలి” వంటి భారీ బ్లాక్ బస్టర్ తర్వాత రాజమౌళి దర్శకత్వంలో వస్తున్న సినిమా RRR.ఫస్ట్ టైం ఇండస్ట్రీలో రెండు పెద్ద కుటుంబాలకు చెందిన హీరోలు.ఈ సినిమాలో నటిస్తూ ఉండటంతో.సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.నందమూరి కుటుంబానికి సంబంధించి ఎన్టీఆర్… మెగా కుటుంబానికి సంబంధించి చరణ్ నటిస్తూ ఉండటంతో.RRR కోసం ఇద్దరు హీరోల అభిమానులు ఎంతగానో వెయిట్ చేస్తూ ఉన్నారు.
ఈ క్రమంలో ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించి అన్ని పనులు పూర్తి కావడంతో పాటు… ప్రమోషన్ కార్యక్రమాలు కూడా స్టార్ట్ చేసేసారు.జనవరి 7వ తారీకు సినిమా రిలీజ్ చేయాలని.
డిసైడ్ అయ్యి.పాన్ ఇండియా లెవెల్ లో.ప్రమోషన్ కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు.
ఇటువంటి తరుణంలో తాజాగా ముంబైలో RRR సినిమా యూనిట్.
మీడియా సమావేశం నిర్వహించి … సినిమాకి సంబంధించి అనేక విషయాలు తెలియజేశారు.అయితే తాజాగా నేడు హైదరాబాదులో సినిమా మీడియా సమావేశం నిర్వహించగా…RRR సినిమా నిర్మాత.
డివివి దానయ్య ఏపీ ప్రభుత్వం పై సంచలన వ్యాఖ్యలు చేశారు.టిక్కెట్ల రేట్లపై విషయంలో ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పట్ల… ప్రభుత్వ పెద్దలు పునరాలోచించాలని కోరారు.
సినిమా టికెట్ల రేట్లను తగ్గిస్తూ ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పెద్ద సినిమాలకు ఏ మాత్రం వర్క్ అవుట్ కాదని డి.వి.వి.దానయ్య స్పష్టం చేశారు.
ఏపీలో మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో టికెట్ రేటు వంద రూపాయలు, మున్సిపల్ పరిధిలో 60 రూపాయలు, పంచాయతీ పరిధిలో 20 రూపాయల ధరలను ఏపీ ప్రభుత్వం నిర్ణయించడం జరిగింది.దీంతో ఈ రేట్లతో సినిమా థియేటర్లను నడపటం కష్టమని.ఆన్ లైన్ బుకింగ్ విధానం విషయంలో… కొంత సమయం ప్రభుత్వం తీసుకుని నిర్ణయం తీసుకుంటే బాగుంటుందని ఇండస్ట్రీకి చెందిన పలువురు.అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.