సంచలనాలకు కేరాఫ్ అడ్రస్ గా మారిన రామ్ గోపాల్ వర్మ( Ram Gopal Varma ) చేసిన ప్రతి సినిమా ఏదో ఒక సంచలనాన్ని సృష్టిస్తుందని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు.ఇక ఏపీ పాలిటిక్స్ ని బేస్ చేసుకొని ఆయన చేసిన వ్యూహం సినిమా( vyooham ) చాలా అడ్డంకులను దాటుకొని మరి ఈరోజు రిలీజ్ అయింది.
అయితే ఈ సినిమాలో వర్మ ఎవరిని బ్యాడ్ గా చూపించకుండానే తన ఒపీనియన్ ని సినిమాగా బాగా మలిచి ప్రేక్షకుల ముందు ఉంచాడు.నిజానికి ఇది ముందు కల్పిత సినిమా అని దర్శకుడు చెప్పినప్పటికీ ట్రైలర్ చూసిన ప్రతి ఒక్కరికీ అది ఏపీ పాలిటిక్స్( AP Politics ) లో జరిగుతున్న విషయాలను బేస్ చేసుకొని తీసిన సినిమా అని ఈజీగా తెలిసిపోతుంది.
ఇక ఇలాంటి క్రమంలోనే వర్మ ఈ సినిమాని ఇంతకుముందు సినిమాల్లా కాకుండా కాన్ స్టంట్ గా ఒక జెన్యూన్ స్టోరీ ని చెప్పడానికి తెరకెక్కించాడు.ఇక ఎవరి వైపు పక్షపాతం వహించకుండా ఏపీలో జరిగిన సంఘటనలను ప్రేక్షకుల ముందు ఉంచే ప్రయత్నం అయితే చేశాడు.ఇక అందులో వర్మ దాదాపు సక్సెస్ అయ్యాడనే చెప్పాలి.ఇక ఎలక్షన్స్ ముందు ఈ సినిమా వల్ల ఎవరికి ప్రయోజనం అనే విషయాన్ని పక్కన పెడితే ఏపీలో జరిగిన విషయాలని ప్రజలకు తెలియజేసే ప్రయత్నం అయితే చేశాడు.
ఇక వర్మ ఏ విషయాన్ని అయిన సరే డీప్ గా అనాలసిస్ చేసిన తర్వాతే దాన్ని సినిమాగా తెరకెక్కించే ప్రయత్నం అయితే చేస్తాడు.
ఇక ఇంతకుముందు రక్త చరిత్ర సినిమా సమయంలో కూడా వర్మ పరిటాల రవి క్యారెక్టర్ ను ఎంత హై లెవెల్లో చూపించాడో మనకు తెలిసిందే.ఈ సినిమాలో మాత్రం అందరి క్యారెక్టర్ లను చాలా అద్భుతంగా ఎస్టాబ్లిష్ చేసి వాళ్ళ క్యారెక్టర్ల తాలూకు ఇంపార్టెన్స్ ని కూడా సినిమాలో చూపించాడు.ప్రస్తుత రాజకీయాల్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి క్యారెక్టర్ లని సినిమాలో ఇన్ క్లూడ్ చేస్తూ ఒక బెస్ట్ అవుట్ ఫుట్ తో ఈ సినిమాను తెరకెక్కించాడు.
ఇక ఈ సినిమాను చూసిన చాలామంది ప్రేక్షకులు వర్మ ఇస్ బ్యాక్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు…
.