రైల్వే ఉద్యోగాల పేరిట రిటైర్డ్ ఎస్సై మోసం.. ?

కంచె చేను మేసిందనే సామేతను తలపిస్తున్న వార్త ఏంటంటే.ఒక పోలీసు డిపార్ట్‌మెంట్‌లో గౌరవమైన వృత్తిలో నుండి పదవి విరమణ పొందిన రిటైర్డ్ ఎస్సై గుర్రం రాజమౌళి అనే అతను రైల్వేలో ఉద్యోగాలు ఇప్పిస్తానని చేసిన ఘరానా మోసం వెలుగులోకి వచ్చింది.

 Retired Essay Fraud In The Name Of Railway Jobs Jagityala, Retired Si, Fraud, R-TeluguStop.com

పూర్తి వివరాల్లోకి వెళ్లితే జగిత్యాల జిల్లాలో 2016 లో పనిచేస్తున్న ఎస్సై గుర్రం రాజమౌళి ఆ సమయంలో రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండల కేంద్రానికి చెందిన సాన అనిల్ కుమార్, కునబోయిన చంద్రశేఖర్ ఇద్దరు యువకుల నుండి, తనకు రైల్వే శాఖలో తెలిసిన వారు ఉన్నారని జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలను ఇప్పిస్తానని నమ్మించి ఒక్కొక్కరి దగ్గర నుండి 13 లక్షలు దొబ్బేశాడట.అంతే కాకుండా ఒరిజినల్ సర్టిఫికెట్లు కూడా తీసుకున్నాడు.

,/br>

అయితే ఇప్పటి వరకు ఉద్యోగం మాట దేవుడెరుగు, కనీసం తీసుకున్న డబ్బులు కూడా ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నాడట.కాగా తమ డబ్బులు తమకు ఇమ్మని కోరగా తను ఎస్సై నని ఏమి చేసుకుంటారో చేసుకోండి అంటూ బెదిరింపులకు గురి చేశాడని బాధితులు మీడియా ముందు వాపోయారట.

ఇక రిటైర్డ్ ఎస్సై గుర్రం రాజమౌళి వీరినే కాకుండా ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుండి మరో 16 మందిని మోసం చేసినట్టు తెలిసింది.అయితే ఈ కేసు విషయంలో ఎవరు పట్టించుకోవడం లేదని తమకు న్యాయం చేయవలసిందిగా మీడియా ముఖంగా వెల్లడిస్తున్నారట బాధితులు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube