ప్రస్తుతం పవన్ కళ్యాణ్ క్రిష్ దర్శకత్వంలో ‘హరిహర వీరమల్లు’ సినిమా చేస్తున్నాడు.ఇది హిస్టారికల్ సినిమా కావడంతో ఇందులో యాక్షన్ సీన్లు ఎక్కువుగా ఉన్నాయి.
మాములు సినిమాలు అంటే పెద్దగా యాక్షన్ సీన్లు ఉండవు కాబట్టి అంత భయం ఉండదు.కానీ హిస్టారికల్ సినిమాలు అంటే యుద్దాలు ఎక్కువుగా ఉంటాయి.
అందువల్ల ఇలాంటి సినిమాలు చేసేటప్పుడు చాలామందికి గాయాలు అవుతుంటాయి.
అయితే తాజాగా ఈ సినిమాలో యాక్షన్ సన్నివేశాలలో భాగంగా ఒక ప్రముఖ నటుడు గాయపడ్డాడని సమాచారం.
ఈ సినిమాలోని యాక్షన్ సీన్స్ తెరకెక్కించడానికి క్రిష్ ప్రముఖ కొరియోగ్రాఫర్ కౌశల్ ను తీసుకున్నారు.ఇప్పటికే పవన్ కళ్యాణ్ తో కొన్ని యాక్షన్ సీన్లు కూడా కౌశల్ చేయించాడు.
ఈ సినిమాలో నటిస్తున్న ఆదిత్య మీనన్ యాక్షన్ సన్నివేశాలు చిత్రీకరించే సమయం లో గాయపడినట్టు తెలుస్తుంది.
ఈ సినిమాలో గుర్రపు స్వారీ చేస్తున్న సమయంలో ఆదిత్య మీనన్ గుర్రం మీద నుండి కింద పడి తీవ్రం గా గాయపడినట్టు తెలుస్తుంది.ఈయన ప్రస్తుతం చెన్నై లోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.అయితే ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
ఈ ఘటన జరిగి నాలుగు రోజులు అవుతుందట.అంతేకాదు ఇప్పుడు ఆదిత్య ఆరోగ్య పరిస్థితి బాగానే ఉందని సమాచారం.
ఆదిత్య ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఫోటోను సోషల్ మీడియాలో పోస్టు చేసారు.ఈ విషయం తెలుసుకున్న వారు ఆయన త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నారు.ఇది ఇలా ఉండగా ఈ సినిమాను దిల్ రాజు, బోణీ కపూర్ సంయుక్తంగా భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కిస్తున్నారు.ఈ సినిమాలో శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుంది.
ఈ సినిమా వచ్చే సంవత్సరం సంక్రాంతికి విడుదల కాబోతుంది.