ప్రపంచ రికార్డ్ సృష్టించిన అమెరికా..ఎందులోనో తెలుసా...!!

ప్రస్తుత పరిస్థితుల నేపధ్యంలో అమెరికా ప్రపంచ రికార్డ్ సృష్టించిందంటే ఎందులోనో తడుముకోకుండా చెప్పచ్చు.అవును అదే కరోనా కేసుల్లోనే అమెరికా ప్రపంచ రికార్డ్ సృష్టించింది.

 Covid Cases Increased In America Due To Christmas And New Year Celebrations, Ch-TeluguStop.com

అంతేకాదు తన రికార్డ్ లు తానే తిరిగి రాసుకుంటోంది.ఊహించి విధంగా రోజు రోజుకి కరోనా కేసులు నమోదు కావడంతో ప్రస్తుతం అమెరికాలో కరోన కేసుల సంఖ్య కోట్లకి చేరుకోగా, మృతుల సంఖ్య లక్షల్లో ఉంది.

అయితే కేవలం నిన్న ఒక్క రోజులోనే అమెరికాలో నమోదైన కరోనా కేసుల సంఖ్య తెలుసుకుంటే షాక్ అయ్యి గుడ్లు తేలేస్తారు.

అమెరికాలో కేవలం 24 గంటలు గడవక ముందే నమోదైన కేసుల సంఖ్య అక్షరాలా 2.77 లక్షలు.ఇంతమంది కరోనా భారిన పడ్డారు.

గతంలో అమెరికాలో ఈ స్థాయిలో కేసులు నమోదు కాలేదు,ఒక్క అమెరికాలో మాత్రమే కాదు ప్రపంచంలో ఎక్కడా ఒక్క రోజులు ఇన్ని కేసులు నమోదు కాలేదని అంటున్నారు పరిశీలకులు.ఒక్క సారిగా ఇంత భారీ మొత్తంలో కేసులు నమోదు కావడానికి కారణాలు లేకపోలేదు.

అమెరికా ప్రముఖ అంటువ్యాధుల నిపుణుడు ఆంటోని పౌచీ ఈ మేరకు ముందు నుంచి హెచ్చరికలు జారీ చేస్తూనే ఉన్నారు.

Telugu Anthony Fauci, Christmas, Corona Vaccine, Covid, Covidamerica-Telugu NRI

క్రిస్మస్, న్యూస్ ఇయర్ వేడులకు అమెరికన్స్ దూరంగా ఉండాలని, మన ప్రాణాలకంటే గుంపుగా కూడి సంబారాలు చేసుకోవడం మనకు ముఖ్యం కాదని హెచ్చరిస్తూనే ఉన్నారు.ఒక వేళ వేడుకల్లో పాల్గొంటే కేసుల తీవ్రత రెట్టింపు అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని, దూర ప్రాంతాలు కూడా వెళ్లవద్దని హెచ్చరించారు.పౌచీ మాటలు లెక్కచేయని అమెరికన్స్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకుండానే వేడులలలో పాల్గొన్నారు ఫలితంగా పౌచీ చెప్పినట్టుగానే రికార్డ్ స్థాయిలో కేసులు నమోదయ్యాయి.

పరిస్థితిని అదుపు చేయకపోతే రాబోయే రోజుల్లో మరిన్ని కేసులు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.ఒక వైపు కరోనా వ్యాక్సిన్ లు అందుబాటులో ఉన్నా అమెరికన్స్ వ్యాక్సిన్ వేసుకోవడానికి ముందుకు రాకపోవడం కూడా కేసులు పెరగడానికి ముఖ్య కారణమని తెలుస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube