తెలుగు బుల్లితెర , సినీ రంగాల్లో యాంకర్ సుమ( Anchor Suma ) గురించి తెలయని వాళ్లు ఉండరు.తన యాంకరింగ్ తో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకుంది.
కెరీర్ ప్రారంభంలో పలు టీవీ ప్రోగ్రాంలకు యాంకరింగ్ చేసి మంచి గుర్తింపు తెచ్చుకుంది.పంచావతారం, స్టార్ మహిళ, భలే ఛాన్సులే వంటి ప్రోగ్రాం లు సుమకు మంచి క్రేజ్ ను తెచ్చిపెట్టాయి.
కేవలం టీవీ ప్రోగ్రాంలతో సరిపెట్టుకోకుండా సినిమా ఫంక్షన్ లకు కూడా యాంకరింగ్ చేస్తూ పాపులర్ అయింది.ఏ ప్రోగ్రాం అయినా యాంకర్ గా సుమ అయితేనే బాగుంటుందని అందరూ అనుకునేంతగా సుమ తనను తాను తీర్చిదిద్దుకుంది.
అవ్వడానికి మళయాళీ అమ్మాయి అయినా.తెలుగు ఇంటి కోడలుగా వచ్చి తెలుగు భాష మీద పట్టు పెంచుకుంది…

ఎక్కడైనా తన వాక్ చాతుర్యంతో అందరినీ కట్టిపడేస్తుంది .తెలుగు కూడా అంతే చక్కగా మాట్లాడుతుంది.అంతేకాదు స్టార్ హీరోల సినిమాలకు ప్రీ రిలీజ్ ఫంక్షన్( Pre Release Events ) జరిగితే సుమ ఉండాల్సిందే, స్టార్ హీరోల ఇంటర్వ్యూలు జరగాలన్నా సుమ ఉండాల్సిందే.
సాధారణంగా వయసు పెరుగుతుంటే యాంకర్ గా అవకాశాలు కోల్పోతుంటారు.కొత్త యాంకర్లు వస్తుంటే పాత యాంకర్లు మరుగున పడిపోతుంటారు.ఇప్పటికి చాలా మంది పరిస్థితి అదే.కానీ ఎంత మంది కొత్త వారు వచ్చినా.సుమ ఇమేజ్ మాత్రం ఏమాత్రం తగ్గలేదు.స్టార్స్ కు ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్నట్టు.తెలుగులో సుమకు కూడా ఫ్యామిలీ ఆడియన్స్ నుంచి ఫ్యాన్ బేస్ ఉంది.తన కామెడీ టైమింగ్ తో ఇప్పటికీ బుల్లితెరపై సుమ టాప్ యాంకర్ గా కొనసాగుతోంది.
సాధారణ ప్రేక్షకులు మాత్రమే కాదు టాలీవుడ్ హీరో హీరోయిన్లలోనూ ఆమెకు అభిమానులు ఉన్నారు.ఇక తాజాగా సుమ తన రెమ్యూనరేషన్ ( Suma Remuneration ) పెంచేసిందనే టాక్ బలంగా వినిపిస్తుంది .గతంలో తీసుకున్నదానికంటే ఎక్కుగా డిమాండ్ చేస్తుందని అంటున్నారు .

వాస్తవానికి సుమ జోరు కాస్త తగ్గింది.గతంలో మాదిరి అన్నింట ఆమె కనిపించడంలేదు.సెలక్టీవ్ గా చేస్తోంది.
కావాలని తగ్గించిందా.లేదా అవకాశాలు తగ్గాయా అనేది తెలియదు కాని… వరుస ప్రోగ్రామ్స్ లో కనిపించే ఆమె ప్రభావం తగ్గింది.
గతంలో టీవీ ప్రోగ్రాములతో పాటు స్టార్ హీరోల సినిమాల ప్రీ రిలీజ్ ఫంక్షన్లు సహా ఇతరత్రా ఈవెంట్లకు సుమ హోస్టుగా వ్యవహరిస్తు.రెండు చేతులా సంపాదిస్తున్న సుమ ఈమధ్య మరింత రెమ్యునరేషన్ పెంచింది .తన ప్రభావం తగ్గినా కూడా.రెమ్యునరేషన్ విషయంలో కాంప్రమైజ్ అవ్వడంలేదు .దీనితో కొందరు నిర్మాతలు ఆలోచనలో పడినట్టు తెలుస్తుంది .అంత ఇచ్చి ప్రోగ్రాం చేయించుకొవడం కష్టమే అని అనుకుంటున్నట్టు తెలుస్తుంది .