రవితేజకు భారీ షాకిచ్చిన బాలయ్య.. టైగర్ కంటే భగవంత్ కేసరి పైచేయి సాధించడంతో?

టాలీవుడ్ ఇండస్ట్రీలో బాలయ్య, రవితేజ బాక్సాఫీస్ వద్ద చాలా సందర్భాల్లో పోటీ పడగా మెజారిటీ సందర్భాల్లో రవితేజ పైచేయి సాధించారు.అయితే ఈ ఏడాది దసరా పండుగ సమయంలో టైగర్ నాగేశ్వరరావు, భగవంత్ కేసరి( Tiger Nageswara Rao vs Bhagavanth Kesari సినిమాలు విడుదల కాగా ఈ రెండు సినిమాలలో భగవంత్ కేసరి పైచేయి సాధించింది.

 Raviteja Huge Shock To Balakrishna Details Here Goes Viral In Social Media ,ra-TeluguStop.com

రవితేజకు బాలయ్య భారీ షాకిచ్చారనే చెప్పాలి.టైగర్ నాగేశ్వరరావు పుంజుకునే ఛాన్స్ అయితే లేదు.

పెద్దగా అంచనాలు లేకుండానే థియేటర్లలో ఈ సినిమా విడుదల కాగా అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించడంలో టైగర్ నాగేశ్వరరావు ఫెయిలైంది.

నిడివి కనీసం అరగంట తగ్గించి ఉంటే ఈ సినిమా రిజల్ట్ మరోలా ఉండేది.ఈ సినిమాలో అనవసర సీన్లకు ప్రాధాన్యత ఇచ్చారని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.మాస్ మహారాజ్( Mass Maharaj Raviteja ) తనకు సూట్ కాని పాత్రను ఎంపిక చేసుకుని రిస్క్ చేశారనే చెప్పాలి.

బయోపిక్ లకు కమర్షియల్ వాల్యూ తీసుకొనిరావడం సులువు కాదు.ప్రేక్షకులకు మంచి అనుభూతిని కలిగించడంలో టైగర్ నాగేశ్వరరావు ఫెయిలైంది.కొన్ని సీన్లలో హీరో పాత్ర ప్రేక్షకులకు అసహ్యం కలిగించేలా ఉంది.స్క్రీన్ ప్లే లోపాలు ఈ సినిమా పాలిట శాపంగా మారాయి.

రేణు దేశాయ్ ఈ సినిమాలో నటించడం వల్ల ఈ సినిమాకు పెద్దగా మేలు జరిగింది ఏమీ లేదు.

భారీ బడ్జెట్, భారీ క్యాస్టింగ్ ఉన్నా దర్శకుడు ఒక మంచి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడంలో ఫెయిలయ్యారు.టైగర్ నాగేశ్వరరావు( Tiger Nageswara Rao Review ) బాక్సాఫీస్ వద్ద టైగర్ అనిపించుకోవడంలో ఫెయిల్ కావడం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతోంది.ఈ టైగర్ గాండ్రించలేదని నెటిజన్ల నుంచి కామెంట్లు వినిపిస్తున్నాయి.

రవితేజ తర్వాత సినిమాలతో అయినా కచ్చితంగా సక్సెస్ సాధించాల్సి ఉంది.సినిమా సినిమాకు రవితేజ మార్కెట్ పెరుగుతున్నా రవితేజ కథల ఎంపికలో జాగ్రత్త వహించాల్సి ఉందని కామెంట్లు వినిపిస్తున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube