మాస్ మహారాజ రవితేజ( Raviteja ) మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధం అయ్యాడు.ప్రస్తుతం ఈయన టైగర్ నాగేశ్వరరావు బయోపిక్ లో నటిస్తున్నాడు.
వాల్తేరు వీరయ్య, ధమాకా వంటి బ్లాక్ బస్టర్స్ అందుకుని మరింత ఉత్సాహంగా ఈ సినిమాను పూర్తి చేసి రిలీజ్ కు కూడా రెడీ అయ్యాడు.ప్రస్తుతం రవితేజ చేస్తున్న లేటెస్ట్ పాన్ ఇండియన్ మూవీ ‘‘టైగర్ నాగేశ్వరరావు”( Tiger Nageswara Rao ).నూతన డైరెక్టర్ వంశీ దర్శకత్వంలో భారీ స్థాయిలో తెరకెక్కుతున్న ఈ సినిమాతో రవితేజ కూడా పాన్ ఇండియా స్టార్ గా మారనున్నాడు.మరి మొదటిసారి పాన్ ఇండియన్ సినిమా చేస్తుండడంతో ఈయన ఎలాంటి హిట్ అందుకుంటాడా అని ఫ్యాన్స్ కూడా ఎదురు చూస్తున్నారు.
పాన్ ఇండియా లెవల్లో ప్రమోషన్స్( Tiger Nageswara Rao Promotions ) కూడా బాగా చేస్తూ సినిమాను ప్రేక్షకులకు చేరువ చేస్తున్నారు.ప్రమోషనల్ కంటెంట్ కూడా ఆకట్టు కోవడంతో ఈ సినిమాకు అంచనాలు బాగానే పెరిగాయి.ఇక తాజాగా ఈ సినిమా సెన్సార్ పూర్తి చేసుకున్నట్టు మేకర్స్ అఫిషియల్ గా సోషల్ మీడియా పోస్ట్ ద్వారా తెలిపారు.ఈ సినిమాకు యు/ఏ సర్టిఫికెట్ ను జారీ చేసినట్టు తెలిపారు.
ఇక రన్ టైం కూడా ఫైనల్ గా లాక్ అయ్యింది.
ఈ సినిమాకు గత కొద్దీ రోజుల నుండి వైరల్ అవుతున్న రన్ టైం కాదని తెలుస్తుంది.ఫైనల్ గా ఈ సినిమా 2 గంటల 52 నిముషాల రన్ టైం( Tiger Nageswara Rao Run time ) ను లాక్ చేసారని కన్ఫర్మ్ అయ్యింది.ఇక ఈ సినిమాలో నుపుర్ సనన్, గాయత్రీ భరద్వాజ్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు.
ఈ సినిమాకు జివి ప్రకాష్ కుమార్ స్వరాలు అందిస్తుండగా అక్టోబర్ 20న గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది.ఇక అనుపమ్ ఖేర్, రేణు దేశాయ్, జిషు సేన్ గుప్తా కీలక పాత్రలు పోషిస్తున్నారు.