బాలీవుడ్ సీనియర్ నటి రవీనా టాండన్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.ఒకప్పుడు బాలీవుడ్ లో ఎన్నో మంచి మంచి సినిమాలను నటించి తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకుంది రవీనా టాండన్.
ఇటీవల విడుదలైన కే జి ఎఫ్ సినిమాలో కూడా నటించిన విషయం తెలిసిందే.ఇది ఇలా ఉంటే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న రవీనా టాండన్ ఆమెకు ఎదురైనా ఒక చేదు సంఘటన గురించి తెలిపింది.
ఇంటర్వ్యూలో భాగంగా రవీనా టాండన్ మాట్లాడుతూ.
ఒక అభిమాని ఆమెకు అతని రక్తంతో రాసిన ప్రేమ లేఖలు అలాగే బ్లడ్ వయల్స్ కొన్ని అశ్లీల చిత్రాలు కొరియర్ ద్వారా పంపించేవాడని చెబుతూ ఆ షాకింగ్ అనుభవం గురించి వెల్లడించింది.
ఆమె భర్త తడాని పిల్లలతో కలిసి వెళుతుండగా ఒక అభిమాని కారుపై పెద్ద రాయి విసిరిన ఘటనను కూడా గుర్తు చేసుకుంది.ఆ ఘటన తో భయపడిపోయిన రవీనా టాండన్ వెంటనే పోలీసులకు కూడా ఫిర్యాదు చేసినట్టు తెలిపింది.
అంతేకాకుండా అభిమాని ఆమెపై ఉన్న ప్రేమను నిరూపించుకోవడం కోసం ఏకంగా ఆమె ఇంటి గేటు బయట క్యాంపు నిర్వహించాడు అని తెలిపింది.

ఇకపోతే రవీనా టాండన్ ఇటీవలే సెకండ్ ఇన్నింగ్స్ ని మొదలుపెట్టిన విషయం తెలిసిందే.ప్రస్తుతం ఈమె అర్బాజ్ ఖాన్ నిర్మాతగా వ్యవహరిస్తున్న పట్నా శుక్లా సినిమాలో నటిస్తోంది.ఇంకా ఇందులో సతీష్ కౌశిక్, మానవ్ విజ్, చందన్ రాయ్ సన్యాల్, జతిన్ గోస్వామి,పలువురు కీలకపాత్రలో నటిస్తున్నారు.
ఈమె సినిమాల పరంగా ఎంత బిజీగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం ఫుల్ యాక్టివ్ గా ఉంటూ ఎప్పటికప్పుడు అభిమానులతో ముచ్చటిస్తూ ఉంటుంది.అంతేకాకుండా అప్పుడప్పుడు తన భర్త పిల్లలతో కలిసి వెకేషన్ తిరుగుతూ అందుకు సంబంధించిన ఫోటోను కూడా విడుదల చేస్తూ ఉంటుంది.