ఈ మధ్యకాలంలో సినిమాలలో పాటలు, సన్నివేశాలు మరీ శృతిమించి ఉంటున్నాయి.వీటిపై మహిళా సంఘాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్న నిర్మాతలు లాభాల కోసం అలాంటి సన్నివేశాలు పెట్టి సినిమాలు తీస్తున్నారు.
ముఖ్యంగా ఆడవాళ్ళు అంటే అంగడి సరుకు మాదిరి, వారితో వల్గర్ డైలాగ్స్ చెప్పించడం, శృతి మించి రొమాన్స్, శృతి మించిన వైలెంట్ సన్నివేశాలు పెడుతున్నారు.ఇప్పుడు కన్నడనాట తాజాగా రిలీజ్ అయిన ఒక పాట విషయంలో మహిళా సంఘాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.
దృవ్ సర్జా హీరోగా కన్నడలో పొగరు అనే సినిమా తెరకెక్కుతుంది.ఈ సినిమాలో హీరోయిన్ గా సౌత్ క్రేజీ హీరోయిన్ రష్మిక మందన నటిస్తుంది.
ఇందులో హీరో రౌడీగా చాలా వైలెంట్ పాత్రలో కనిపిస్తున్నాడు.ఇక హీరో హీరోయిన్ ని ప్రేమించమని టీజ్ చేసే సాంగ్ ఒకటి చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది.
అయితే ఈ సాంగ్ లో హీరోయిన్ ని ప్రేమించమని హీరో తన శాడిజం చూపించే విధంగా సన్నివేశాలు ఉన్నాయి.ఈ సన్నివేశాలు యువతలో మరొంత వైలెన్స్ ని పెంచే విధంగా ఉన్నాయని ఇప్పుడు మహిళా సంఘాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.
ఇప్పటికే దేశంలో మహిళల మీద అరాచకాలు పెరిగిపోతూ ఉంటే ఇలాంటి సాంగ్స్, సన్నివేశాల ద్వారా మరింతగా వాటిని ప్రోత్సహిస్తున్నట్లు ఉందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.తక్షణం ఈ సాంగ్ ని సినిమా నుంచి యుట్యూబ్ నుంచి తొలగించాలని మహిళా సంఘాలు డిమాండ్ చేస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.