భూకంప బాధితులకు సాయం చేసిన రషీద్‌ఖాన్.. దగ్గరుండి ఇల్లు కట్టించాడు

ఎక్కడైనా భూకంపం వచ్చిందంటే అక్కడ ఖచ్చితంగా భయానక పరిస్థితులు ఏర్పడతాయి.రెక్కల కష్టంతో కట్టుకున్న ఇళ్లన్నీ కూలిపోయి, భూమిలోకి కుంగిపోయి కనిపిస్తాయి.

 Rashid Khan Helped Earthquake Victims , Rashid Khan, Rare Record, Helping Earth-TeluguStop.com

ఇక చాలా మంది నిరాశ్రయులై, అయిన వారిని కోల్పోయి పుట్టెడు దుఃఖంలో ఉంటారు.అలాంటి వారిని ఓదార్చడం అంటే మామూలు విషయం కాదు.

అందులోనూ వారు కోల్పోయిన ఇంటిని తిరిగి నిర్మించాలంటే చాలా ఖర్చు చేయాల్సి ఉంటుంది.ఇక ఆఫ్ఘన్ క్రికెటర్ రషీద్ ఖాన్ తాను ఉన్నానంటూ బాధితుల కోసం ముందుకు వచ్చాడు.

ఇటీవల ఆఫ్ఘన్ ప్రాంతంలో కూలిపోయిన ఇళ్లను నిర్మిస్తూ, బాధితులకు కొండంత అండగా నిలబడ్డాడు.దీనికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.

Telugu Afghanistan, Rare, Rashid Khan, Ups-Latest News - Telugu

ఆగ్నేయ ఆఫ్ఘనిస్తాన్‌లోని పక్తికా ప్రావిన్స్‌లో ఇటీవలి విధ్వంసకర భూకంపాలు సంభవించాయి.ఆ ప్రాంతంలో వందల ఇళ్లు కూలిపోయాయి.నిరాశ్రయులైన బాధితులు తమకు దిక్కెవరున్నారంటూ విలపిస్తున్నారు.ఈ సమయంలో ఆఫ్ఘన్ క్రికెటర్ రషీద్ ఖాన్ స్థాపించిన రషీద్ ఖాన్ ఫౌండేషన్ ద్వారా వారిని ఆదుకోవడానికి ముందుకు వచ్చాడు.

భూకంపం వల్ల ప్రభావితమైన వందల కుటుంబాల కోసం తిరిగి ఇళ్లను నిర్మిస్తున్నాడు.భూకంపం బారిన పడిన, పాక్టికాలోని పేద ప్రజల కోసం షెల్టర్ల నిర్మాణాలు పక్టికాలోని బర్మల్ జిల్లాలో ప్రారంభమయ్యాయి.

దాదాపు ఒక నెల క్రితం భూకంపం కారణంగా ఈ ప్రాంతంలో తమ ఇళ్లను కోల్పోయిన తరువాత ఇప్పుడు బహిరంగ ప్రదేశంలో నివసిస్తున్నారు.ప్రకృతి ఆగ్రహానికి గురై, ఆత్మీయులను, ఇళ్లు, ఆస్తులను కోల్పోయిన స్థానికులు ఆప్ఘన్ క్రికెటర్ రషీద్ ఖాన్ దయార్ధ్ర హృదయంతో వారిని ఆదుకున్నాడు.

గత నెలలో విపత్తు భూకంపం సంభవించిన ఆగ్నేయ ఆఫ్ఘనిస్తాన్‌లోని పక్తికా, ఖోస్ట్ ప్రావిన్స్‌లలోని అనేక ప్రాంతాలలో, అనేక మరణాలు, గణనీయమైన ఆస్తి నష్టం సంభవించింది.భూకంప బాధితుల కోసం కేటాయించిన సహాయాన్ని తాలిబాన్‌లు తమ సొంత సభ్యులకు పంపిణీ చేశారని ఆరోపణలొచ్చాయి.

ఈ పరిస్థితిలో రషీద్ ఖాన్ వారికి బాసటగా నిలిచి, ఇళ్లు కట్టించాడు.దీంతో అతడిపై ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube