ప్రముఖ నటి రాశి ఖన్నా( Raashi Khanna ) గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు.‘ఊహలు గుసగుసలాడే’ అనే సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది ఈ అమ్మడు.ఈ సినిమా ద్వారా కాస్త పాజిటివ్ టాక్ సంపాదించుకొని దర్శక నిర్మాతల కంట్లో పడింది రాశి.తెలుగులో ఈ ముద్దుగుమ్మకు అభిమానులు కూడా బానే ఉన్నారు.అయితే ఎన్టీఆర్ నటించిన ‘జై లవ కుశ’ తప్ప పెద్ద హీరోల సినిమాల్లో నటించే అవకాశం దక్కించుకోలేకపోయింది.టైర్ 2 హీరోల సరసన నటించిన ఈ చిన్నది గతంలో వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది.
కానీ ఇప్పుడు మాత్రం అలాంటి పరిస్థితులు ఏమి కనిపించడం లేదు.
దాంతో టాలీవుడ్ ఇండస్ట్రీలో రాశి ఖన్నాను ఎందుకు ఎక్కువగా పట్టించుకువడం లేదు అనే సందేహం అందరిలో మొదలైంది.
ఒకప్పుడు వరుస సినిమాల్లో నటించి బిజీగా ఉన్న ఈ అమ్మడు ఇప్పుడు సైలెంట్ అవ్వడంతో ఫ్యాన్స్ కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.ప్రస్తుతం తెలుగులో ఈ అమ్మడుకి ఒక అవకాశం కూడా రావడం లేదు.
దాంతో రాశి ప్రస్తుతం ఏం చేస్తుంది? వేరే ఇండస్ట్రీలో నటిస్తుందా అని ఆమె అభిమానులు ఆరా తీస్తున్నారు.రీసెంట్ గా ఈ అమ్మడు బ్లాక్ బాడీ కాన్ డ్రెస్ లో అందాలు ఆరబోస్తూ దర్శనమిచ్చింది.
ముంబై వేదికగా జరిగిన గ్లోబల్ స్పా అవార్డ్స్ ఈవెంట్ లో అందరి కళ్ళు రాశి ఖన్నా వైపు చూసాయి.
ఈ మధ్య ఎక్కువగా ముంబై(Mumbai ) లో ఉంటున్న ఈ ముద్దుగుమ్మ అక్కడి దర్శకనిర్మాతల కంట్లో పడాలని ప్రయత్నాలు చేస్తుంది.అవకాశాలు రాకపోవడంతో వెబ్ సిరీస్ లో కుడా నటించడానికి రెడీ అని చెప్తుంది ఈ చిన్నది.అయిన కూడా సిరీస్ మేకర్స్ ఒక్కరు కూడా రాశి ఖన్నా గురించి ఆలోచించడం లేదు.
ఒకప్పుడు టాప్ హీరోలు రాశి కన్నాతో నటించడానికి ఆసక్తి చూపించేవారు.అలాంటిది ఇప్పుడు వారు కూడా ఆమెని పట్టించుకోవడం మానేశారు.
దీనిబట్టి చూస్తే టాలీవుడ్ ఇండస్ట్రీలో రాశి ఖన్నా టైమ్ అయిపోయినట్లే అనిపిస్తుంది.అయితే వేరే ఇండస్ట్రీలో ఆమెకి అవకాశాలు వస్తునప్పటికి స్టార్ మాత్రం కాలేకపోతుంది.
2022 లో రాశి ఖన్నా థాంక్యూపక్కా కామెర్షియల్( Pakka Commercial ) ‘ లాంటి సినిమా లో నటించింది.కానీ ఆ రెండు సినిమాలు డిసస్టర్ గా మిగిలాయి.ప్రస్తుతం మీ అమ్మడి చేతిలో ఒక తెలుగు ప్రాజెక్టు కూడా లేదు.దాంతో బాలీవుడ్ పై దృష్టి పెట్టింది ఈ చిన్నది.ప్రస్తుతం సిద్ధార్థ్ మల్హోత్రా హీరోగా నటిస్తున్న ‘ యోధ ‘ అనే సినిమా లో హీరోయిన్ గా నటిస్తుంది.ఈ సినిమా ఏడాది చివర్లో విడుదల అయ్యే అవకాశాలు ఉన్నాయి.
అలానే తమిళ్ లో కూడా రెండు సినిమాల్లో నటించబోతుంది రాశి ఖన్నా.ఆ రెండు చిన్న సినిమాలే.
అయితే అవి చిన్న సినిమాలో అయినప్పటికీ మంచి విజయాన్ని అందుకుంటే మాత్రం తమిళంలో రాశికి మంచి అవకాశాలు దక్కుతాయి.అలానే జరిగితే రాశి ఖన్నా తెలుగులో మళ్లీ కనిపించే అవకాశలు ఉన్నాయి.
లేదంటే ఆమె సినీ కెరీర్ ముగిసినట్టే అని అర్ధం చేసుకోవాలి.