రామ్ చరణ్, అల్లు అర్జున్ మధ్య అభిప్రాయ బేధాలు ఉన్నాయి అన్ని ఎప్పటి నుంచో వార్తలు వినిపిస్తున్న విషయం తెలిసిందే.ఇదే విషయం కొన్ని కొన్ని సార్లు బయటపడుతూ వచ్చింది.
తాజాగా జరిగిన 69వ నేషనల్ అవార్డు( 69th National Awards ) కార్యక్రమంతో ఈ విషయం మరొకసారి బయటపడింది.తాజాగా అల్లు అర్జున్( Allu Arjun ) ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డుని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే.
తెలుగు సినిమా ఇండస్ట్రీ గర్వించదగ్గ విషయం అయినప్పటికీ ఈ జాతీయ అవార్డు అల్లు అర్జున్ రామ్ చరణ్ మధ్య చిచ్చు పెట్టింది అంటూ వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి.అంతేకాకుండా ఈ అవార్డు ద్వారా తాజాగా మరోసారి వీళ్లిద్దరి మధ్య గ్యాప్ బయటపడింది.
జాతీయ అవార్డు గెలుచుకున్నందుకుగాను అల్లు అర్జున్ కి రాజకీయ నాయకులు పెద్దపెద్ద ప్రముఖులు సెలబ్రిటీలు పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలిపారు.ఈ నేపథ్యంలోనే చెర్రీ( Ram Charan ) శుభాకాంక్షలు చెప్పిన తీరు, దానిపై అల్లు అర్జున్ స్పందించిన మీరు ప్రస్తుతం చర్చనీ అంశంగా మారింది.జాతీయ అవార్డులపై ట్వీట్ చేశాడు చరణ్.ఆర్ఆర్ఆర్( RRR ) నుంచి మొదలుపెట్టాడు.ఆ సినిమాకు 6 అవార్డులు వచ్చిన సందర్భంగా శుభాకాంక్షలు తెలిపాడు.ఆ తర్వాత వైష్ణవ్ తేజ్ కు, బుచ్చిబాబుకు శుభాకాంక్షలు తెలిపాడు.
ఆ తర్వాత అల్లు అర్జున్ కు, దేవిశ్రీప్రసాద్ కు కలిపి కామన్ గా కంగ్రాట్స్ చెప్పాడు.చివర్లో అలియాకు కూడా శుభాకాంక్షలు చెప్పి ముగించాడు.
ఇలా తన సందేశంలో బన్నీని గుంపులో గోవిందయ్యలా కలిపేశాడే తప్ప, ప్రత్యేకంగా అభినందించలేదు.దీనికి బన్నీ కూడా అంతే ముక్తసరిగా థ్యాంక్ యూ అంటూ రిప్లయ్ ఇచ్చాడు.దీంతో ఈ విషయం కాస్త హాట్ టాపిక్ గా మారడంతో సోషల్ మీడియా లో రామ్ చరణ్ వర్సెస్ అల్లు అర్జున్ వార్ మొదలయ్యింది.ఈ క్రమంలోనే ఈ ఇద్దరు హీరోల అభిమానులు పరస్పరం విమర్శలు గుప్పించుకుంటూ ట్రోల్స్ కూడా చేస్తున్నారు.
అయితే దీనంతటికీ కారణం జాతీయ అవార్డు( National Award ) పలువురు విమర్శిస్తున్నారు.జాతీయ అవార్డు వచ్చినందుకు సంతోషించాలో ఇలా బంధువులు స్టార్ హీరోలు అయిన వారి మధ్య దూరం పెరుగుతున్నందుకు బాధపడాలో అర్థం కావడం లేదు అని నైటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.