అంబటి రాంబాబుపై మండిపడుతూ చిరంజీవిని పొగిడిన ఆర్జీవీ.. రచ్చ చేయడం అనవసరమంటూ?

ఇటీవల మెగాస్టార్ చిరంజీవి( Chiranjeevi ) సినిమా హీరోల రెమ్యూనరేషన్ గురించి రాజ్యసభలో మాట్లాడడం ఏంటని, ఇంతకు మించిన పెద్ద సమస్యలే లేవా అంటూ మండి పడిన విషయం తెలిసిందే.చిరు చేసిన కామెంట్లు కాస్త పొలిటికల్ టర్న్ తీసుకున్నాయి.

 Ram Gopal Varma Opens Up About Chiranjeevi Comments On Remunerations And Ambati-TeluguStop.com

దాంతో వైసీపీ నాయకులు చిరంజీవిపై విరుచుకుపడ్డారు.నిజానికి రాజ్యసభలో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి హీరోల రెమ్యునరేషన్‌ల పై చేసిన కామెంట్లను ఉద్దేశించి చిరంజీవి మాట్లాడారు.

కానీ, అది కాస్త ఏపీ ప్రభుత్వం మీద మాట్లాడినట్టుగా తప్పుగా వెళ్లింది.తాజాగా ఈ వివాదంపై టాలీవుడ్ సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ స్పందించారు.

Telugu Ambati Rambabu, Ap, Chiranjeevi, Ram Gopal Varma, Rgv Vyuham, Tollywood,

ఆ జీవి తాజాగా దర్శకత్వం వహించిన సినిమా వ్యూహం( RGV Vyuham ).ఈ సినిమాపై చర్చ కోసం తాజాగా ఒక మీడియాతో ముచ్చటించిన ఆయన రెమ్యునరేషన్ అంశంపై స్పందించారు.ఈ సందర్భంగా రామ్ గోపాల్ వర్మ మాట్లాడుతూ.రెమ్యునరేషన్ అనేది మార్కెట్ రియాలిటీ.నిర్మాత, హీరోకి మధ్య జరిగే అంతర్గత ఒప్పందం.మార్కెట్‌లో ఎంత రికవరీ ఉంది, సినిమాకు ఎంత అవుతుంది.

ఆ మధ్యలో వచ్చే మొత్తంపై రెమ్యునరేషన్ డిపెండ్ అవుతుంది.కానీ అది బయటవాళ్లకు తెలీదు.

విజయసాయి రెడ్డి ఏ కాంటెక్ట్స్‌లో చెప్పారో నాకు తెలీదు.ఒక సినిమాకు చెప్పారా, మొత్తం ఫిలిం ఇండస్ట్రీని దృష్టిలో పెట్టుకుని చెప్పారా నేను చూడలేదు.

చిరంజీవి చెప్పింది కరెక్ట్.

Telugu Ambati Rambabu, Ap, Chiranjeevi, Ram Gopal Varma, Rgv Vyuham, Tollywood,

రెమ్యునరేషన్ విషయంలో చిరంజీవి చెప్పిన దానితో నేను ఏకీభవిస్తాను అని చెప్పుకొచ్చారు.అలాగే హీరోలు చాలా ఎక్కువ రెమ్యునరేషన్లు తీసుకుంటున్నారు అనేది చాలా పెద్ద బూతు అని తెలిపారు వర్మ( Ram gopal varma )అనంతరం మంత్రి అంబటి రాంబాబు బ్రో మూవీ గురించి చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ.అదేమీ రూల్ కాదు.

ఒకరి అభిప్రాయం మాత్రమే.నేను బ్రో సినిమా చూడలేదు కానీ, అంబటి రాంబాబు వివాదం గురించి విన్నాను.

అది ఎంత స్టుపిడ్ అంటే.వందల మీమ్స్ వస్తుంటాయి.

గాంధీని కూడా వదలకుండా మీమ్స్ పెడుతుంటారు.అలాంటి పరిస్థితుల మధ్య మనం ఉన్నప్పుడు సినిమాలో ఏదో చూపిస్తే ఎందుకంత రియాక్ట్ అవ్వడం.

అంబటి రాంబాబు సీన్ కూడా నేను చూడలేదు.వేరే పేరు బదులు నా పేరే పెట్టొచ్చు కదా అని రాంబాబు ఏదో అన్నారు.

ఇది చాలా స్టుపిడ్ థింగ్ అని నా అభిప్రాయం.దాని గురించి రచ్చ చేయడం అనవసరం.

అలాంటివి రోజుకి వెయ్యి చూస్తాను నేను.వాళ్లు ఎవ్వరినీ వదలరు అంటూ రాంబాబు పై మండిపడ్డారు ఆర్జీవి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube