చరణ్‌కు కోత పెడుతున్న ఆచార్య

మెగాస్టార్ చిరంజీవి నటిస్తోన్న లేటెస్ట్ మూవీ ‘ఆచార్య’ ఇప్పటికే 40 శాతం షూటింగ్ పూర్తి చేసుకున్న సంగతి తెలిసిందే.అయితే కరోనా వైరస్ కారణంగా ఈ సినిమా షూటింగ్‌కు బ్రేక్ పడింది.

 Ram Charan Role Cut Short In Acharya, Ram Charan, Acharya, Chiranjeevi, Koratala-TeluguStop.com

కాగా ఈ సినిమాను స్టార్ డైరెక్టర్ కొరటాల శివ డైరెక్ట్ చేస్తుండటంతో అంచనాలు పీక్స్‌లో ఉన్నాయి.ఇక ఈ సినిమాలో చిరు సరికొత్త లుక్‌లో మనకు కనిపిస్తాడని చిత్ర యూనిట్ మొదట్నుండీ చెబుతూ వస్తోంది.
అంతేగాక ఆచార్య సినిమాలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఓ కేమియో పాత్రలో నటిస్తాడని తెలిసిందే.ఈ సినిమాలో చరణ్ పాత్ర ఏకంగా 30 నిమిషాల పాటు ఉంటుందని టాక్.

కానీ ప్రస్తుతం నెలకొన్న కరోనా వైరస్ కారణంగా ఈ సినిమా మరింత ఆలస్యం అవుతుండటంతో దర్శకుడు కొరటాల శివ ఆందోళనకు గురవుతున్నాడట.కాగా ఈ సినిమాలో వీలైనంత వరకు మార్పులు చేస్తున్నాడట.

ఇందులో భాగంగా చరణ్ కేమియో పాత్రను తగ్గించేందుకు కొరటాల ప్లాన్ చేస్తున్నాడు.చరణ్ పాత్ర నిడివికి కోత పెట్టడంతో కొంత సమయం కలిసొస్తుందని ఆయన భావిస్తున్నాడు.

ఈ విషయం తెలుసుకున్న ఫ్యాన్స్ అవాక్కవుతున్నారు.చిరు సినిమాలో చరణ్ పాత్రకు కోత పెట్టడం సమంజసం కాదని వారు అంటున్నారు.అయితే ప్రస్తుత పరిస్థితుల్లో కోత తప్పదని చిత్ర యూనిట్ అంటోంది.ఇక ఈ సినిమాలో చిరు సరసన అందాల భామ కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తోన్న సంగతి తెలిసిందే.

చరణ్ పాత్రకు కూడా ఈ సినిమాలో ఓ హీరోయిన్ ఉండనుంది.మరి ఆమె పాత్రలో ఎవరు నటిస్తారో తెలియాలంటే సినిమా రిలీజ్ అయ్యే వరకు ఆగాల్సిందే.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube