తమిళ్ స్టార్ డైరెక్టర్లతో చరణ్.. క్రేజీ పిక్ వైరల్!

స్టార్ డైరెక్టర్ లలో ఒకరైన శంకర్ ( Shankar )నిన్న గ్రాండ్ గా తన పుట్టిన రోజు వేడుకలు జరుపుకున్నట్టు తెలుస్తుంది.ఇండియన్ జేమ్స్ కామెరాన్ శంకర్ బర్త్ డే వేడుకలు ఈసారి గ్రాండ్ గా సినీ సెలెబ్రిటీల మధ్య జరిగినట్టు తెలుస్తుంది.

 Ram Charan Directors And Others Were Snapped In A Candid Moment, Ram Charan,, Ko-TeluguStop.com

మరి ప్రస్తుతం శంకర్ చేస్తున్న సినిమాల్లో చరణ్ సినిమా ఒకటి.అందుకే చరణ్, నిర్మత దిల్ రాజు కలిసి శంకర్ బర్త్ డే వేడుకలను సెట్స్ లో గ్రాండ్ గా నిర్వహించారు.

ఇక శంకర్ పుట్టిన రోజు వేడుకల నుండి నిన్న కొన్ని పిక్స్ బయటకు రాగా ఇప్పుడు మరిన్ని పిక్స్ వైరల్ అవుతున్నాయి.వీటిలో ఒక క్రేజీ అండ్ ఇంట్రెస్టింగ్ పిక్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.రామ్ చరణ్ తేజ్ శంకర్ కాంబోలో తెరకెక్కుతున్న లేటెస్ట్ సినిమాల్లో ”గేమ్ ఛేంజర్” ఒకటి.ఈ పాన్ ఇండియన్ మూవీపై ముందు నుండి భారీ అంచనాలు నెలకొన్నాయి.

ఇప్పటికే దాదాపు 70 శాతం షూటింగ్ పూర్తి కాగా ఇప్పుడు మిగిలిన భాగం షూట్ శరవేగంగా పూర్తి అవుతుంది.ఇక ఈ సినిమాలో విలన్ గా నటిస్తున్న ఎస్ జె సూర్య( S J Suryah ) సోషల్ మీడియాలో కొన్ని పిక్స్ షేర్ చేసారు.

ఈయన షేర్ చేసిన పిక్స్ లో ఒక పిక్ అందరిని ఆకట్టు కుంటుంది.మధ్యలో చరణ్( Ram Charan ) ఉండగా అటు ఇటు తమిళ్ స్టార్ డైరెక్టర్లు అంతా ఈ పిక్ లో ఉన్నారు.

ఈ పిక్స్ వైరల్ అవుతుంది.

ఈ ఫొటోలో లోకేష్ కనకరాజ్, విగ్నేష్ శివన్, లింగుస్వామి, గౌతమ్ మీనన్, కార్తీక్ సుబ్బరాజు, శంకర్, వెట్రిమారన్ తో పాటు టాలీవుడ్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని కూడా ఉన్నారు.ఇంత మంది డైరెక్టర్లతో చరణ్ దిగిన ఈ స్నాప్ నెట్టింట క్రేజీగా మారింది.మరి ఈ డైరెక్టర్ లలో ఎవరితో అయినా చరణ్ భారీ ప్రాజెక్ట్ ఉంటుందేమో అని అప్పుడే సోషల్ మీడియాలో చర్చ స్టార్ట్ అయ్యింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube