మెగాస్టార్ తనయుడు టాలీవుడ్ పాన్ ఇండియా హీరో రామ్ చరణ్( Ram Charan ) ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న గేమ్ చేంజర్ సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే.ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత విడుదల అవుతున్న సినిమా కావడంతో ఈ సినిమాపై భారీగా అంచనాలు నెలకొన్నాయి.
ఈ సినిమా కోసం రామ్ చరణ్ అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.కాగా రామ్ చరణ్ ప్రస్తుతం ఒకవైపు సినిమాల్లో నటిస్తూనే మరొకవైపు నా కూతురుతో కలిసి కొంత సమయాన్ని గడుపుతున్నారు.
అలాగే ఈ మధ్యకాలంలో వరుసగా ఒకదాని తర్వాత ఒకటి కమర్షియల్ యాడ్స్( Commercial ads ) లో నటిస్తున్నారు రామ్ చరణ్.
అలా ప్రస్తుతం వరుస సినిమాలు, యాడ్స్ తో రామ్ చరణ్ బిజీగా ఉన్నాడు.కాగా చరణ్ ఇప్పటికే ఎన్నో యాడ్స్ లలో నటించిన విషయం తెలిసిందే.అందులో ప్రముఖ బ్రాండ్స్ కూడా ఉన్నాయి.
ఇప్పుడు మరో కొత్త యాడ్ లో నటించారు చెర్రీ.ప్రస్తుతం అందుకే సంబందించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
తాజాగా సరికొత్త యాడ్ ద్వారా రామ్ చరణ్ ప్రేక్షకుల ముందుకు వస్తూ తండ్రి పట్ల ఉన్నటువంటి ప్రేమను తెలియజేయడమే కాకుండా నాన్నను చూసి నేర్చుకున్నాను అంటూ ఈయన చెప్పినటువంటి డైలాగ్స్ యాడ్ చాలా బాగుంది.ప్రముఖ బ్రాండెడ్ బట్టల సంస్థ మాన్యవర్( Manyavar ) కోసం ఈ యాడ్ చేశారు.
ఇందులో భాగంగా రామ్ చరణ్ నాన్న అడుగులో అడుగు వేస్తూ చాలా నేర్చుకున్నాను.ఆయనను చూసి చేసే పనిలో పట్టుదలతో ఉండాలని, మనల్ని ప్రేమించే వారిని ఎక్కువగా మనకంటే ప్రేమించాలని తెలుసుకున్నాను.తన గురించి ఆలోచనని వారికోసం ఆలోచించడం నాన్నను చూసే నేర్చుకున్నాను, జీవితంలో నిలబడానికి నాన్నని చూసే నేర్చుకున్నాను అంటూ రామ్ చరణ్ ప్రతి ఒక్క నాన్న కొడుకుల కథని ఒక చిన్న యాడ్ లో చూపించేశాడు.తండ్రి కొడుకుల బంధంతో పాటుగా యాడ్ బాగా వచ్చింది.
కాగా ప్రస్తుతం ఈ యాడ్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.ఈ వీడియో చూసిన అభిమానులందరూ కూడా ఈ వీడియోలో నాన్న పాత్రలో చిరంజీవి చేసే ఉంటే బాగుండేది అంటూ కామెంట్స్ చేస్తున్నారు.