మెగాస్టార్ చిరంజీవి వారసుడిగా రాంచరణ్ (Ram Charan) ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి హీరోగా తండ్రికి మించిన తనయుడు అనే పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు.ఇలా రామ్ చరణ్ పాన్ ఇండియా స్థాయిలో ఎంతో మంచి ఆదరణ పొందారు.
ఇండస్ట్రీలో ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి రామ్ చరణ్ ప్రస్తుతం వరుస పాన్ ఇండియా సినిమాలను లైన్లో పెట్టి షూటింగ్ బిజీగా ఉన్నారు.ఇలా కెరియర్ పరంగా రామ్ చరణ్ ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారని చెప్పాలి.
ఇక ఈయన వ్యక్తిగత విషయానికి వస్తే రామ్ చరణ్ 2011వ సంవత్సరంలో ఉపాసన (Upasana) ను వివాహం చేసుకున్నారు.
ఉపాసన రాంచరణ్ ప్రేమ వివాహం చేసుకున్న విషయం మనకు తెలిసిందే.ఉపాసనని ప్రేమించినటువంటి రామ్ చరణ్ ఈ విషయాన్ని తన కుటుంబ సభ్యులకు తెలియజేసి పెద్దల సమక్షంలో వీరిద్దరూ ఎంతో అంగరంగ వైభవంగా వివాహం చేసుకున్నారు.ఇలా వీరి వివాహం జరిగిన 11 సంవత్సరాలకు ఈ దంపతులు తల్లిదండ్రులుగా మారిన సంగతి మనకు తెలిసిందే.
ఇలా ఈ ఏడాది జూన్ 20వ తేదీ ఉపాసన ఆడబిడ్డకు జన్మనిచ్చారు.ఈ చిన్నారికి క్లీన్ కార(Klin Kaara)అనే నామకరణం చేశారు.ఇలా కూతురి ఆలనా పాలనా చూసుకుంటూ ఉపవాసన రాంచరణ్ దంపతులు ఎంతో సంతోషంగా ఉన్నప్పటికీ వీరి మధ్య తరచూ ఒక విషయం గురించి గొడవ జరుగుతూనే ఉందట.
చిన్నప్పటి నుంచి ఉపాసన ప్రతి విషయంలోనూ చాలా స్ట్రిక్ట్ గా ఉంటారట ఎంతో క్రమశిక్షణగా పెరిగినటువంటి ఈమె ఏ పని అయినా కూడా టైం ప్రకారం చేయాల్సిందేనని భావిస్తూ ఉంటారట అయితే రామ్ చరణ్ ను పెళ్లి చేసుకున్న తర్వాత కూడా రామ్ చరణ్ కి కూడా అదే క్రమశిక్షణ అలవాటు చేస్తూ వచ్చారట అయితే కొన్నిసార్లు మాత్రం రామ్ చరణ్ ఉపాసన( Ramcharan Upasana ) మాట వినే వారు కాదట అయినప్పటికీ ఈ విషయంలో మాత్రం ఉపాసన కాస్త కేర్ తీసుకొని రాంచరణ్ విషయంలో కూడా ప్రతిదీ సక్రమంగా టైం టు టైం జరిగేలా ఈమె జాగ్రత్తలు తీసుకున్నారట.తమకి కూతురు పుట్టిన తర్వాత ఉపాసన కూతురు( Upasana Daughter ) ఆలనా పాలన చూసుకోవడంలో బిజీగా ఉన్నప్పటికీ రామ్ చరణ్ మాత్రం టైం సెన్స్ ఫాలో కావడం పూర్తిగా పక్కన పెట్టేసి తనకు ఇష్టం వచ్చినట్టు నడుచుకుంటున్నారట దీంతో రామ్ చరణ్ తో ఉపాసన ఈ విషయం గురించి గొడవకు దిగేవారట.
ఇలా మనం చేసే ఏ పనైనా సరైన టైమ్ ప్రకారం క్రమశిక్షణతో( Discipline ) చేయకపోతే చేసే పని వృధా అవుతుంది అన్న ఉద్దేశంతో ఉపాసన రాంచరణ్ ఇద్దరు కూడా గొడవపడే వారని ఇలా వీరిద్దరు గొడవ పడుతున్నప్పటికీ మెగా ఫ్యామిలీ చూస్తూ ఉంటారే తప్ప ఏమీ ఇన్వాల్వ్ కారని తెలుస్తుంది.ఎందుకంటే ఉపాసన చెప్పే విషయం అక్షరాల సత్యం అంతేకాకుండా అలా భార్యాభర్తల విషయంలో ఇన్వాల్వ్ అయితే ఆ గొడవ తారా స్థాయికి వెళ్తుందని అందుకే మెగా ఫ్యామిలీ చూస్తున్నప్పటికీ ఏమాత్రం వీరికి అడ్డు చెప్పే ప్రయత్నం చేయరట.ఇలా పోట్లాడినంత సేపు పోట్లాడుకొని తిరిగి రామ్ చరణ్ ఉపాసన ఇద్దరు ఒక్కటైపోతారని తెలుస్తోంది.
ఇలా భర్తనే క్రమశిక్షణలో పెట్టడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నటువంటి ఉపాసన కూతురి విషయంలో తనని ఎంత క్రమశిక్షణగా పెంచుతారో చెప్పాల్సిన పనిలేదు.