రాజమండ్రి రోజ్ మిల్క్ టైటిల్ సాంగ్ విడుదల

జై జాస్తి, అనంతిక, జంటగా సన్నీల్ కుమార్, వెన్నెల కిషోర్, ప్రవీణ్, ప్రణీత్ పట్నాయక్ ముఖ్యపాత్రల్లో రూపొందుతున్న చిత్రం రాజమండ్రి రోజ్ మిల్క్.నాని బండ్రెడ్డి దర్శకత్వంలో ప్రముఖ నిర్మాణ సంస్థ సురేష్ ప్రొడక్షన్స్, తో కలిసి ఇంట్రూప్ నిర్మాణ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది.

 Rajahmundry Rose Milk Title Song Details, Rajahmundry Rose Milk Movie, Director-TeluguStop.com

డి.సురేష్‌బాబు, ప్రదీప్ ఉప్పలపాటి నిర్మాతలు.ఇటీవల ఈ చిత్రంలోని ఓ సాంగ్‌ను, ఫస్ట్‌లుక్‌ను విడుదల చేసిన చిత్రం బృందం తాజాగా ఈ చిత్రం టైటిల్‌సాంగ్‌ను సోమవారం విడుదల చేసింది.

ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ ప్రముఖ గీత రచయిత చంద్రబోస్ రచించిన నువ్వే ముద్దుగా నవ్వే నవ్వగా.

ఉండే నిండుగా.ఫస్ట్‌డే ఫస్ట్ షో చూసినట్టుగా అనే సాంగ్‌ను అనురాగ్ కులకర్ణి ఆలపించారు.

అజయ్ అరసాడ సంగీత బాణీలు అందించిన ఈ సాంగ్‌ను నేడు విడుదల చేశాం.పాటకు అందరి నుంచి మంచి స్పందన వస్తోంది.

పూర్తి వినోదాత్మకంగా రూపొందుతున్న ఈ యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ అందరికి కాలేజీ రోజులను గుర్తుచేస్తుంది.కాలేజీ రోజుల్లో జరిగిన మరపురాని సంఘటనలను ఈ చిత్రం జ్ఞప్తికి తెస్తుంది అన్నారు.

ఈ చిత్రానికి సంగీతం: గోవింద్ వసంత్, అజయ్ అరసాడ, యశ్వంత్ నాగ్, భరత్-సౌరభ్, డీఓపీ: ముఖేష్.జి, శక్తి అరవింద్, సాహిత్యం: చంద్రబోస్, అనంత్‌శ్రీరామ్, శ్రీమణి, ప్రొడక్షన్ డిజైనర్: అభిషేక్ రాఘవ్.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube