తెలుగు ప్రేక్షకులకు బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్( Amitabh Bachchan ) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఈయన ఈ వయసులో కూడా అదే ఊపుతో సినిమాలలో నటిస్తూ దూసుకుపోతున్న విషయం తెలిసిందే.
ఒకవైపు కమర్షియల్ యాడ్స్ మరొకవైపు పలు షోలు మరొకవైపు సినిమాలు ఇలా బాగానే సంపాదిస్తున్నారు అమితాబ్ బచ్చన్.ఈ వయసులో కూడా అంతే ఎనర్జిటిక్ గా సినిమాలు చేస్తూ ఈ తరం హీరోలకు గట్టి పోటీని ఇస్తున్నారు.
ఇకపోతే ఇటీవలె ప్రభాస్ నటించిన కల్కి సినిమా( Kalki 2898 AD )తో తెలుగు ప్రేక్షకులను పలకరించిన విషయం తెలిసిందే.

ఇందులో సాలిడ్ పర్ఫామెన్స్ తో ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నారు.ఇది ఇలా ఉంటే ఒక వైపు సినిమాలు చేస్తూనే మరొకవైపు బుల్లితెరపై హోస్ట్ గా ఎప్పుడు నుంచో ఒక క్రేజీ షో చేస్తున్నారు.అదే కోన్ బనేగా కరోడ్ పతి( Kaun Banega Crorepati ).దీనినే తెలుగులో మీలో ఎవరు కోటీశ్వరుడుగా కూడా కింగ్ నాగార్జున, మెగాస్టార్ చిరంజీవి అలాగే జూనియర్ ఎన్టీఆర్ చేసిన విషయం తెలిసిందే.అయితే లేటెస్ట్ గా అమితాబ్ షోలో మన టాలీవుడ్ స్టార్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పై ప్రశ్న ఒకటి వైరల్ గా మారింది.
ఇందులో ఒక కపుల్ పాల్గొనగా వారికి ఇటీవల దక్షిణాదిలో డిప్యూటీ సీఎం అయ్యిన ఒక స్టార్ ఎవరు అనే ప్రశ్న ఎదురైంది.

దీనితో ఈ బిట్ ని పవన్ ఫ్యాన్స్ రికార్డ్ చేసి వైరల్ చేస్తున్నారు.మరి ఆ ప్రశ్నకి జంట ఆడియెన్స్ పోల్ తీసుకోగా 50 శాతం మందికి పైగా పవన్ కళ్యాణ్ పేరునే సెలెక్ట్ చేయగా వారు కూడా అనే సమాధానం ఎంచుకున్నారు.దీనితో 1 లక్ష 60 వేలు వారు గెలుచుకున్నారు.
దీనితో సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ గా చక్కర్లు కొడుతోంది.ఇందుకు సంబంధించిన వీడియో ని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు సోషల్ మీడియాలో తెగ వైరల్ చేస్తున్నారు.
అలాగే అమితాబ్ బచ్చన్ పై కూడా కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.