సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్లు గా కొనసాగే కొంతమంది సెలబ్రిటీలు మంచి క్రేజ్ వచ్చిన తర్వాత పెళ్లిళ్లు చేసుకోవడానికి వెనకడుగు వేస్తారు ఒకవేళ పెళ్లి చేసుకున్న పిల్లల్ని( Children ) కనరు.పిల్లల్ని కంటే ఎక్కడ వారి అందం తగ్గుతుందోనని షేప్ అవుట్ అయితే తమకు అవకాశాలు రావని భావించి చాలామంది సరోగసి వైపు మొగ్గు చూపుతున్నారు.
మరి కొంతమంది మాత్రం నవ మాసాలు మోసి పిల్లల్ని కానీ తల్లి ప్రేమను చాటుకుంటున్నారు.ఇప్పటికే ఎంతోమంది సెలబ్రిటీలు అనారోగ్య సమస్యలతో కూడా సరోగసి ద్వారా అమ్మలుగా మారిన సంగతి తెలిసిందే.
ఇకపోతే ఇండస్ట్రీలో పాప్ సింగర్ గా( Pop Singer ) కొనసాగుతూ ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకుని, అందంలో కూడా హీరోయిన్లకు ఏమాత్రం తీసిపోని సింగర్ సెలీనా గోమెజ్( Selena Gomez ) ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.ఈమె అమెరికన్ పాప్ సింగర్ అనే సంగతి మనకు తెలిసిందే.అయితే మన ఇండియాలో కూడా ఈమెకు పెద్ద ఎత్తున అభిమానులు ఉన్నారు.ఈ సందర్భంగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈమె పిల్లల్ని కనడం గురించి మాట్లాడుతూ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
నాకు నా బిడ్డను నవమాసాలు మోసి కనీ నా చేతులతో పెంచాలని ఉంది.కానీ అది సాధ్యం కాదు.నాకి ఉన్న ఆరోగ్యపరమైన సమస్యల కారణంగా నేను బిడ్డను కనాలని చూసిన నాకు నా బిడ్డ ప్రాణాలకు ప్రమాదం వస్తుంది అందుకే ఎవరినైనా దత్తత తీసుకొని పెంచాలని అనుకుంటున్నాను అంటూ ఎమోషనల్ అయ్యారు.ఈ విధంగా ఈ జీవితంలో పిల్లల్ని కనలేనని తెలిసిన ఈమె ఎంతో ఆవేదన వ్యక్తం చేశారు.
అయితే తన ఆరోగ్య సమస్యలు ఏంటి అనేది మాత్రం వెల్లడించలేదు.ఇకపోతే ఈమె మరో అమెరికన్ పాప్ సింగర్ జస్టిన్ బీబర్ తో కొన్నాళ్ళు ప్రేమాయణం నడిపి అనంతరం బ్రేకప్ కూడా చెప్పుకున్నారు.