ఘనంగా జబర్దస్త్ సుజాత సీమంతపు వేడుకలు.. ఫోటోలు వైరల్!

జబర్దస్త్( Jabardasth ) కార్యక్రమం ద్వారా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు కమెడియన్ రాకింగ్ రాకేష్( Rocking Rakesh ).ఇలా ఈ కార్యక్రమంలో కమెడియన్ గా కొనసాగుతూనే సినిమాలలో కూడా ఈయన నటిస్తూ ప్రేక్షకులను మెప్పించారు.

 Rocking Rakesh Shared Sujatha Baby Shower Photos Details,rocking Rakesh,sujatha,-TeluguStop.com

ప్రస్తుతం హీరోగాను అలాగే నిర్మాతగా కూడా ఇండస్ట్రీలో కొనసాగుతున్న సంగతి తెలిసిందే.ఇకపోతే రాకింగ్ రాకేష్ జోర్దార్ సుజాత( Jordaar Sujatha )ను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.

ఈమె జోర్దార్ వార్తల ద్వారా ఎంతో ఫేమస్ అయ్యారు.అనంతరం బిగ్ బాస్ ,( Bigg Boss ) కార్యక్రమంలో కంటెస్టెంట్ గా సందడి చేశారు.

బిగ్ బాస్ కార్యక్రమం తర్వాత జబర్దస్త్ కార్యక్రమంలో రాకేష్ టీంలో సందడి చేసిన ఈమె రాకేష్ ప్రేమలో పడ్డారు పెద్దల సమక్షంలో వీరిద్దరూ గత ఏడాది ఎంతో ఘనంగా వివాహం చేసుకున్నారు.

Telugu Jabardasth, Lady Sujatha, Rakesh Sujatha, Rakesh, Sujatha, Sujathababy-Mo

ఇక వివాహం తర్వాత కూడా సుజాత జబర్దస్త్ కార్యక్రమంతో పాటు ఇతర వెబ్ సిరీస్లలో కూడా నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నారు.ఇకపోతే ఈమె త్వరలోనే తల్లి కాబోతున్న సంగతి మనకు తెలిసిందే.ప్రస్తుతం ప్రెగ్నెంట్ అయినటువంటి సుజాత మరి కొద్ది రోజులలో పండంటి బిడ్డకు జన్మనివ్వబోతున్నారు.

ఈ క్రమంలోనే తాజాగా రాకేష్ సుజాత సీమంతపు( Baby Shower ) వేడుకలకు సంబంధించిన కొన్ని ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఇవి కాస్త వైరల్ అవుతున్నాయి.

Telugu Jabardasth, Lady Sujatha, Rakesh Sujatha, Rakesh, Sujatha, Sujathababy-Mo

ఈమె డెలివరీ డేట్ సెప్టెంబర్ లోనే ఉన్న నేపథ్యంలో గత కొద్ది రోజుల క్రితం ఘనంగా సీమంతపు వేడుకలను నిర్వహించారు.ఈ కార్యక్రమానికి కుటుంబ సభ్యులతో పాటు సన్నిహితులు బుల్లితెర నటీనటులు కూడా హాజరై సందడి చేశారు.ఇక ఈ ఫోటోలను షేర్ చేసిన ఈయన ఈ సమయంలో సుజాత ఆనందం చూస్తుంటే నా ఆనందానికి అవధులు లేవు.

నీ మీద నా ప్రేమకు అవధులు లేవు అంటూ భార్యపై తనకు ఉన్నటువంటి ప్రేమను బయటపెట్టారు.ఇక ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఎంతో మంది అభిమానులు ఈ జంటకు ముందుగానే శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube