స్కాట్లాండ్‌కు చెందిన భారత సంతతి ట్రాన్స్‌జెండర్( Transgender of Indian origin ) మహిళ శుక్రవారం ఎడిన్‌బర్గ్‌లోని రేప్ క్రైసిస్ సెంటర్ హెడ్ ( Head of the Rape Crisis Center in Edinburgh )(సీఈవో) పదవికి రాజీనామా చేసింది.లైంగిక వేధింపుల బాధితులకు మద్ధతుగా ఏర్పాటు చేసిన ఈ యూనిట్ మహిళల రక్షణలో విఫలమైందని ఓ స్వతంత్ర సమీక్షలో తేలడంతో ఆమె తన పదవి నుంచి తప్పుకున్నారు.
ఎడిన్‌బర్గ్ రేప్ క్రైసిస్ సెంటర్ (ఈఆర్‌సీసీ) చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గా మృదుల్ వాధ్వా ( Mridul Wadhwa )పనితీరుపై విమర్శలు వచ్చాయి.రేప్ క్రైసిస్ స్కాట్లాండ్ (ఆర్‌సీఎస్) ద్వారా నియమించబడిన ఒక స్వతంత్ర నివేదికలో ఆమె సామర్ధ్యంపై వాస్తవాలు వెల్లడించింది.
ఈఆర్‌సీసీ స్వచ్ఛంద సంస్థ ( ERCC is a voluntary organisation )మాజీ సభ్యుడు , దాని వ్యవస్ధ, పనితీరుపై ఉన్న ఆందోళన వ్యక్తం చేస్తూ ఎంప్లాయ్‌మెంట్ ట్రిబ్యునల్‌లో ఫిర్యాదు చేశారు.దీని ఆధారంగా మృదుల్‌పై ఈ ఏడాది మే నెలలో సమీక్షను ప్రారంభించారు.ఈ నేపథ్యంలో మృదుల్ వాధ్వా, ఈఆర్‌సీసీ బోర్డులో నాయకత్వ మార్పుకు సరైన సమయమని నిర్ణయించినట్లుగా డైరెక్టర్ల బోర్డు ఒక ప్రకటన విడుదల చేసింది.ఈ క్రమంలో మృదుల్ ఈఆర్‌సీసీ సీఈవో పదవి నుంచి తప్పుకున్నారని, కొత్త సీఈవోను గడువులోగా నియమిస్తామని బోర్డు తెలిపింది.
అంతకుముందు మృదుల పనితీరుపై ఆరోపణలు రావడంతో బోర్డు సభ్యులు క్షమాపణలు చెబుతూ ఓ ప్రకటన విడుదల చేసిన సంగతి తెలిసిందే.
న్యాయ నిపుణుడు విక్కీ లింగ్ ఈ స్వతంత్ర సమీక్షకు నాయకత్వం వహించారు.చాలా నెలలుగా ఈఆర్‌సీసీ మహిళలకు వుమెన్ ఓన్లీ వంటి ప్రదేశాలను అందించకపోవడం ఆందోళన కలిగిస్తోందని ఆర్‌సీఎస్ తన ప్రకటనలో తెలిపింది .వాధ్వా రాజీనామాను హ్యారీ పొటర్ రచయిత, వుమెన్ ఓన్లీ స్పేసెస్ ప్రచారకర్త జేకే రౌలింగ్ స్వాగతించారు.అటు స్కాటిష్ పార్లమెంట్ సభ్యుడు స్కూ వెబెర్ కూడా.రేప్ క్రైసిస్ సెంటర్లు దారుణానికి గురైన మహిళలకు సురక్షితంగా ఉండాలని పునరుద్ఘాటించారు.