బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికేపూడి గాంధీ( Arekapudi Gandhi ) మధ్య తలెత్తిన వివాదం బీఆర్ఎస్ , కాంగ్రెస్ ఒక మధ్య రాజకీయ యుద్ధానికి కారణం అయింది. ఒకరిపై ఒకరు విమర్శలు ప్రతి విమర్శలు చేసుకుంటున్నారు.
ఈ వ్యవహారంలో రెండు పార్టీలకు ఊహించని స్థాయిలో డ్యామేజ్ జరిగిందనే అభిప్రాయం ఆ రెండు పార్టీల నేతల్లోనూ ఉంది ఇక తాజాగా పాడి కౌశిక్ రెడ్డి వ్యవహారంపై అరికెపూడి గాంధీ స్పందించారు.బీఆర్ఎస్ కీలక నేత, ఎమ్మెల్యే హరీష్ రావు ( Harish Rao )వాస్తవాలు తెలుసుకోకుండా మాట్లాడుతున్నారని గాంధీ విమర్శలు చేశారు.
అరికెపూడి గాంధీ ఇంటికి వెళ్తానంటూ కౌశిక్ రెడ్డి సవాల్ చేయడం తో తాను అక్కడికి వెళ్లాల్సి వచ్చిందని, గాంధీ అన్నారు.సీనియర్ ఎమ్మెల్యే విషయంలో ప్రాంతీయ విభేదాలు తీసుకువస్తున్నారని బీఆర్ఎస్ నేత వ్యాఖ్యలు, పార్టీ వైకిరా ? వ్యక్తిగత వైఖరా అనేది తెలపాలని అరికెపూడి గాంధీ డిమాండ్ చేశారు.

బీఆర్ఎస్ నేతల వ్యాఖ్యలతో తమ మనోభావాలు దెబ్బతిన్నాయని, ఒక మోసకారి మాటలు ఎంతకాలం పడాలని , ఎంత కాలం నిందలు మీద వేసుకోవాలని అందుకే తాను స్పందించానని గాంధీ అన్నారు.మోసకారి చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ అధ్యక్షుడు స్పందించాలని పరోక్షంగా కౌశిక్ రెడ్డి అంశాన్ని ప్రస్తావించారు. రెచ్చగొట్టే ధోరణితో వ్యవహరిస్తున్నారని , ఇది మంచి పద్ధతి కాదని హితవు పలికారు.బీఆర్ఎస్ అరికేపూడి గాంధీకి యుద్ధం కాదు అని ,తాను బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డితో వ్యక్తిగతంగా యుద్ధం చేస్తున్నానని అరికెపూడి గాంధీ అన్నారు .పాడి కౌశిక్ రెడ్డి( Kaushik Reddy )తో యుద్ధం అనుకునే వెళ్ళానని, పార్టీని కౌశిక్ రెడ్డి భ్రష్టు పట్టిస్తున్నారనే విషయాన్ని గుర్తించాలని, పార్టీలో కౌశిక్ రెడ్డి ప్రాంతీయ విభేదాలు, చీలికలు తీసుకొస్తున్నారని , ఇలాంటి వారితో ప్రమాదం ఉందని కేసీఆర్( KCR ) గుర్తించాలని గాంధీ సూచించారు.

బీఆర్ఎస్ నుంచి మరికొంతమంది ఎమ్మెల్యేలు బయటకు వెళ్లే ప్రమాదం ఉందని, తనకు సమవుజ్జి కానీ కౌశిక్ రెడ్డి ఇంటికి వెళ్ళినందుకు బాధపడుతున్నానని విచారం వ్యక్తం చేశారు .కేసిఆర్, బీఆర్ఎస్ పార్టీ అంటే నాకు ఇప్పటికీ గౌరవం ఉందని అరికెపూడి గాంధీ స్పష్టం చేశారు.