వైసీపీకి రిపేర్లు మొదలుపెట్టిన జగన్

2024 లో జరిగిన అసెంబ్లీ,  పార్లమెంట్ ఎన్నికల్లో వైసీపీ( YCP ) ఊహించని స్థాయిలో ఘోరంగా ఓటమి చెందిన నేపథ్యంలో,  ఆ పార్టీ నుంచి కీలక నాయకులు చాలామంది ఇతర పార్టీల్లో చేరిపోయారు.టిడిపి,  జనసేన ,బిజెపి కూటమి( TDP Janasena BJP Alliance ) అధికారంలో ఉండడంతో ఆయా పార్టీల్లో చేరిపోయారు.

 Ys Jagan Appointing Ycp Party New District Presidents Details, Ysrcp, Telugudesa-TeluguStop.com

ఇక పూర్తిగా వైసిపిని దెబ్బ కొట్టడమే ధ్యేయంగా కూటమి పార్టీలు ప్రయత్నిస్తున్న క్రమంలో పార్టీ నేతలు ఎవరూ అసంతృప్తితో ఇతర పార్టీలలో చేరకుండా ఉండేలా వైసిపి అధినేత జగన్( YS Jagan ) నష్ట నివారణ చర్యలకు దిగారు.  ముఖ్యంగా పార్టీ బలంగా ఉన్న జిల్లాలో చాలాచోట్ల వైసిపి ఘోరంగా ఓటమి చెందడం,  క్యాడర్ చెల్లా చెదురు కావడంతో మళ్లీ పార్టీకి  పునర్ వైభవం తీసుకువచ్చే విధంగా జగన్ అడుగులు వేస్తున్నారు.

 

నెల్లూరు చిత్తూరు, కడప కర్నూలు జిల్లాలోనూ వైసీపీకి ఎదురైన పరాభవాన్ని దృష్టిలో పెట్టుకుని జగన్ తాజాగా కీలక నిర్ణయాలు తీసుకున్నారు.జిల్లాస్థాయిలో పార్టీని సమర్థవంతంగా నడిపించగలిగిన నాయకులకు కొత్తగా జిల్లా అధ్యక్ష బాధ్యతలను అప్పగించే కార్యక్రమానికి జగన్ శ్రీకారం చుట్టారు.

దీనిలో భాగంగానే మాజీ మంత్రులకు జిల్లా అధ్యక్ష బాధ్యతలను అప్పగిస్తున్నారు.

Telugu Chittoor, Janasena, Janasenani, Kakanigovardhan, Nellore, Pavan Kalyan, T

మంత్రిగా ఉన్న సమయంలో జిల్లాలోని అన్ని నియోజకవర్గాల నేతలతోనూ సత్సంబంధాలు,  పార్టీ క్యాడర్ తో విస్తృత పరిచయాలు , ప్రస్తుతం పార్టీ బలోపేతానికి కృషి చేయగలిగిన నాయకులకు జగన్ పార్టీ బాధ్యతలను అప్పగిస్తున్నారు .దీనిలో భాగంగానే ఉమ్మడి చిత్తూరు,  నెల్లూరు జిల్లా అధ్యక్షులుగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి,( Peddireddy Ramachandra Reddy )  కాకాని గోవర్ధన్ రెడ్డిల( Kakani Govardhan Reddy ) పేర్లను జగన్ ఖరారు చేసినట్లు సమాచారం నెల్లూరు జిల్లా వైసీపీ అధ్యక్షుడిగా ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి ప్రస్తుతం కొనసాగుతున్నారు.  అయితే ఆయన ఉపాధ్యాయ ఎమ్మెల్సీ కావడంతో ఆయన పదవికి సరైన న్యాయం చేయలేకపోతున్నారని భావిస్తున్న జగన్ , ఆయన స్థానంలో కాకాణి గోవర్ధన్ రెడ్డి కి బాధ్యతలు అప్పగించాలని నిర్ణయించుకున్నారు. 

Telugu Chittoor, Janasena, Janasenani, Kakanigovardhan, Nellore, Pavan Kalyan, T

ఉమ్మడి నెల్లూరు జిల్లాలో పార్టీ ఓటమి తర్వాత చాలామంది కీలక నాయకులు ఇతర పార్టీలో చేరిపోయినా,  కాకాణి గోవర్ధన్ రెడ్డి మాత్రం పార్టీ బలోపేతానికి కృషి చేస్తూనే టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు , నారా లోకేష్ లను టార్గెట్ చేసుకుని విమర్శలు చేస్తూ , వైసీపీ పై వారు చేస్తున్న విమర్శలను తిప్పికొట్టే ప్రయత్నం చేస్తున్నారు.ఇక ఉమ్మడి వైసిపి జిల్లా బాధ్యతలను మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి అప్పగించారు అయితే ముందుగా ఆ బాధ్యతలు స్వీకరించేందుకు  పెద్దిరెడ్డి ఒప్పుకోకపోయినా,  జగన్ ఆయనకు నచ్చచెప్పి ఒప్పించినట్లు సమాచారం.  ఇదేవిధంగా మిగతా జిల్లాల్లోనూ పార్టీ బాధ్యతలను కీలక నేతలకు అప్పగించే ఆలోచనలో జగన్ ఉన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube