తెలుగు సినిమా ఇండస్ట్రీలో జూనియర్ ఎన్టీఆర్( Jr NTR ) గురించి మన ప్రత్యేకంగా చెప్పుకోవాలి.ఎందుకంటే ఆయన చేసిన సినిమాలు తెలుగు సినిమా ఇండస్ట్రీలో భారీ విజయాలను అందుకుంటు ముందుకు సాగుతున్న విషయం మనకు తెలిసిందే.
మరి ఇలాంటి క్రమంలో ఆయన చేస్తున్న సినిమాల మీద ప్రేక్షకుల్లో విపరీతమైన అంచనాలైతే ఉన్నాయి.ఇక ఇదిలా ఉంటే ప్రస్తుతం ఆయన దేవర సినిమాతో( Devara ) ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నాడు.
ఇక ఇప్పటికే సెప్టెంబర్ 27వ తేదీన ఈ సినిమా రిలీజ్ కి రెడీ అవుతున్న నేపథ్యంలో ఈ సినిమాకు సంబంధించిన కొన్ని విషయాలైతే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.ఇక ముఖ్యంగా దేవర సినిమాలో ఎన్టీఆర్ డాల్ఫిన్ తో చేసే ఫైట్ ఎపిసోడ్ సినిమా మొత్తానికి హైలెట్ గా నిలువబోతున్నట్టుగా కూడా వార్తలైతే వస్తున్నట్టుగా తెలుస్తోంది.ఇక ఈ ఫైట్ క్లైమాక్స్ లో( Climax Fight ) రాబోతుందనే వార్తలైతే వినిపిస్తున్నాయి.ఇక ఇప్పటికే ఈ సినిమాలో ఎన్టీఆర్ తండ్రి కొడుకులుగా చేస్తున్నాడు.
ఇక ఎన్టీయార్ తన నట విశ్వరూపం చూపించడానికి కూడా తను సిద్ధంగా ఉండబోతున్నట్టుగా కూడా తెలుస్తోంది.ఇక మొత్తానికైతే ఈ సినిమాతో తనను తను మరొకసారి స్టార్ హీరోగా ఎలివేట్ చేసుకోవాలనే ప్రయత్నంలో ఉన్నాడు.
ఇక ప్రస్తుతం ఎన్టీయార్ తనను మించిన హీరో మరొకరు లేరని గుర్తింపు సంపాదించుకోవడానికి అహర్నిశలు కష్టపడుతున్నట్టుగా తెలుస్తుంది…ఇక ఇదిలా ఉంటే ఈ సినిమాతో ఎన్టీఆర్ కనక తనను తాను ప్రూవ్ చేసుకుంటే పాన్ ఇండియాలో తనను మించిన నటుడు మరొకరు ఉండరనేది మాత్రం వాస్తవం.ఇక ఇప్పటికే జూనియర్ ఎన్టీఆర్ నందమూరి ఫ్యామిలీ బాధ్యతలను మోస్తూ ముందుకు సాగుతున్న విషయం మనకు తెలిసిందే…చూడాలి మరి ఈ సినిమాతో ఆయన ఎలాంటి సక్సెస్ ను సాధిస్తాడు అనేది…
.