లండన్‌లోని( London ) ఒక టాక్సీ డ్రైవర్( Taxi Driver ) తన మంచి మనసుతో అందరి హృదయాలను గెలుచుకున్నాడు.అతనికి సంబంధించి సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతోంది.
ఈ వీడియోలో డ్రైవర్ ఒక కపుల్ ఛార్జ్ ఇస్తుంటే తీసుకోలేదు.ఆ ఫ్యామిలీ తమ కొడుకును ఆసుపత్రికి వెళ్లడానికి ఈ ట్యాక్సీ ఎక్కారు.
ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్‌లో డ్రైవర్ వీడియోను షేర్ చేశారు.ఆ డ్రైవర్ ఆ కుటుంబానికి ఆ రైడ్ ఫ్రీ( Free Ride ) అని చెప్పారు.
లండన్‌లోని కిడ్స్ ఆసుపత్రి అయిన గ్రేట్ ఆర్మండ్ స్ట్రీట్‌కు( Great Ormond Street ) వెళ్లే కుటుంబాల నుంచి తాను ఎప్పుడూ డబ్బులు తీసుకోనని డ్రైవర్ వివరించారు.పేరెంట్స్ డబ్బులు చెల్లించడానికి ఎంతో ప్రయత్నిస్తారని అయినా తాను నిరాకరిస్తానని చెప్పాడు.
ఆ టాక్సీ డ్రైవర్ చేసిన మంచి పనికి చాలా ముగ్ధులైన ఆ తల్లిదండ్రులు, ఆయనను బాగా కొనియాడారు.వారిలో ఒకరు “మీరు చాలా మంచి మనిషి” అని చెప్పారు.ఆ వీడియోకి “తమ కొడుకును కిడ్స్ ఆసుపత్రికి తీసుకెళ్తున్న తల్లిదండ్రులకు టాక్సీ ఛార్జీని రద్దు చేసిన టాక్సీ డ్రైవర్.” అని ఒక క్యాప్షన్ జోడించారు.ఆ వీడియోను సోషల్ మీడియాలో 5 మిలియన్ల మందికి పైగా చూశారు.
“ఈ డ్రైవర్ చేసిన మంచి పని వల్ల మనుషుల మీద మా నమ్మకం మరోసారి పెరిగింది.ఆయన ఉచితంగా కారులో తీసుకెళ్లడమే కాదు, ఇబ్బందిలో ఉన్న ఆ కుటుంబానికి కొంత సంతోషాన్ని కూడా ఇచ్చాడు.కొన్నిసార్లు చిన్న చిన్న మంచి పనులే చాలా ముఖ్యమైనవి అని అర్థమవుతుంది.” అని అన్నారు.“ఇది చాలా అందమైన విషయం.ఆయనలాంటి వాళ్లు ఎక్కువగా ఉండాలి.” అని మరొకరు పేర్కొన్నారు.
“ఎంత అద్భుతమైన పని చేశాడు! ఆయనకు దేవుడు మంచి చేయాలి.” అని అన్నారు.“ఇది హార్ట్ టచింగ్ ఇన్సిడెంట్.ఇలాంటి క్షణాల వల్ల మనుషుల మీద మన నమ్మకం మరోసారి పెరుగుతుంది.ఆ టాక్సీ డ్రైవర్ చేసిన మంచి పని, ఈ ప్రపంచంలో ఇంకా దయ ఉందని చూపిస్తుంది.” అని అన్నారు.