బ్రిటన్‌కు చెందిన తొలి సిక్కు ఎంపీ తన్‌మన్‌జీత్ సింగ్ ధేసీ ( Tanmanjeet Singh Dhesi )నూతనంగా ఎన్నికైన పార్లమెంట్ రక్షణ కమిటీకి ఛైర్మన్‌గా ఎన్నికయ్యారు.బుధవారం జరిగిన బ్యాలెట్ అనంతరం ధేసీ ఎన్నికైనట్లు ప్రకటించారు.563 చెల్లుబాటయ్యే ఓట్లలో ధేసీకి 320 ఓట్లు.అతని ప్రత్యర్ధి, సహచర లేబర్ ఎంపీ డెరెక్ ట్విగ్( Derek Twigg )కి 243 ఓట్లు వచ్చాయి.
రక్షణ కమిటీకి ఛైర్‌గా ఎన్నికైనందుకు తాను సంతోషిస్తున్నానని.తనపై విశ్వాసం ఉంచినందుకు సహచర ఎంపీలకు ధేసీ కృతజ్ఞతలు తెలిపారు.
స్వదేశంలో , విదేశాలలో మనకు బెదిరింపులు పెరుగుతున్నాయని. డిఫెన్స్ కమిటీ( Defence Committee) ఛైర్‌గా మనదేశం ఎదుర్కొంటున్న సవాళ్లను అధిగమించడంపై దృష్టి సారిస్తానని తన్‌మన్‌జీత్ తెలిపారు.మన భద్రతకు సహకారం అందిస్తున్న సాయుధ దళాలు, వెటరన్స్ తరపున పార్లమెంట్‌లో తాను గొంతుగా ఉంటానని ఆయన చెప్పారు.ప్రస్తుతం యూకే పర్యటనలో ఉన్న భారత మాజీ ఎంపీ తర్లోచన్ సింగ్( Tarlochan Singh ) ఒక సందేశంలో ధేసీకి అభినందనలు తెలిపారు.
గత రెండు పార్లమెంట్‌లలో సభ్యునిగా ఉన్న తాను పలు పార్లమెంటరీ కమిటీలో భాగమైనట్లు ధేసీ చెప్పారు.
కాగా.వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీ సరిహద్దుల్లో నెలల తరబడి రైతులు చేపట్టిన ఆందోళనకు మద్ధతు పలికారు తన్‌మన్ జిత్ సింగ్ ధేసీ .ఆయన ఇండియా వచ్చినప్పుడల్లా విచిత్ర పరిస్ధితులు ఎదురవుతున్నాయి.రైతులు, రైతు సంఘాలు ఆయనను సత్కరిస్తుంటే.పంజాబ్ బీజేపీ శాఖ మాత్రం తన్మన్‌ను ఖలిస్తాన్ మద్ధతుదారుడిగా ఆరోపిస్తోంది.గతేడాది ధేసీ పంజాబ్ వచ్చినప్పుడు బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సుభాష్ శర్మ( Subhash Sharma ) మాట్లాడుతూ.కాశ్మీర్, పాకిస్తాన్, ఖలిస్తాన్‌కు సంబంధించి భారత్‌కు చెడ్డ పేరు తెచ్చే సమస్యలను ధేసి లేవనెత్తారంటూ ఎద్దేవా చేశారు.
ఆయన ఇండియాపై ప్రతికూల వ్యాఖ్యలు చేస్తున్న సంగతి తెలిసిందేనని.తన్మన్‌కు ఖలిస్తానీ గ్రూపులతో సన్నిహిత సంబంధాలు వున్నాయని సుభాష్ శర్మ ఆరోపించారు.
మీడియా నివేదికల ప్రకారం.నిషేధిత ఉగ్రవాద సంస్థ ‘‘ Sikhs for Justice’’ లండన్‌లో నిర్వహించిన రెఫరెండం 2020 ర్యాలీ సహా పలు సందర్భాలలో ధేసీ భారత్‌పై విమర్శలు చేశారు.