తెలుగు సినిమా ఇండస్ట్రీని శాసించే దర్శకులలో రాజమౌళి( Rajamouli ) మొదటి స్థానంలో ఉన్నాడు.ఇక ప్రస్తుతం ఆయన పాన్ వరల్డ్ సినిమా చేస్తూ ముందుకు సాగుతున్న విషయం మనకు తెలిసిందే.
అయితే రాజమౌళి తీసిన సింహాద్రి సినిమా( Simhadri movie ) విషయంలో ఆయన చాలా వరకు చాలా జాగ్రత్తలు తీసుకొని మరి ఈ సినిమాని తెరకెక్కించినట్లుగా తెలుస్తుంది.ఇక అప్పట్లో రాజమౌళి ఒక మాస్ మసాలా సినిమా చేస్తున్నాడు.
అంటూ కొంతమంది సినీ పెద్దలకు తెలిసినప్పుడు అందరూ రాజమౌళిని హేళన గా చూశారట.
ఎందుకంటే మొదటి సినిమా అయిన స్టూడెంట్ నెంబర్ వన్ సినిమాతో ( Student Number One )సాఫ్ట్ గుర్తింపును సంపాదించుకున్న రాజమౌళి మాస్ మసాలా సినిమాలు చేయడం అంటే అంత తేలిక కాదు అంటూ కొంతమంది కామెంట్స్ చేసినప్పటికీ, మొత్తానికైతే ఆయన సింహాద్రి సినిమాతో ఒక భారీ ప్రభంజనాన్ని సృష్టించాడు.ఇక రాజమౌళి మాత్రం మాస్ సినిమాల్లో ఒక స్టాండర్డ్ ని సెట్ చేశాడు.నిజానికి సింహాద్రి సినిమా ఇచ్చిన హైప్ తోనే రాజమౌళి స్టార్ డైరెక్టర్ గా ఎదిగాడు.
ఇక అప్పటి నుంచి వరుసగా మాస్ సినిమాలను చేసుకుంటూ వచ్చిన రాజమౌళి తనదైన రీతిలో సక్సెస్ లను అందుకుంటూ ముందుకు సాగుతున్నాడు.అందుకే ఒక సినిమా సక్సెస్ అనేది ఒక దర్శకుడి జీవితాన్ని మార్చేస్తుందని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.
ఇక అప్పట్లో రాజమౌళిని తక్కువ చేసి మాట్లాడిన చాలామంది ఇప్పుడు ఆయన గురించి చాలా గొప్పగా మాట్లాడుకోవడం చూస్తుంటే రాజమౌళికి చాలా ఆనందంగా ఉందని ఆయన ఒకానొక సందర్భంలో ఒక ఇంటర్వ్యూలో తెలియజేయడం అనేది రాజమౌళి అభిమానులందరిని ఆనందపడేలా చేస్తుంది.ఇక మొత్తానికైతే రాజమౌళి లాంటి స్టార్ డైరెక్టర్ తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉండడం అనేది నిజంగా మన అదృష్టం అనే చెప్పాలి…
.